అన్నదమ్ములతో శ్రీను వైట్ల మల్టీస్టారర్..!

శ్రీను వైట్లతో సినిమా అంటేనే హీరోలంతా ఆమడ దూరం పారిపోతున్నారు. ఈమధ్యన శ్రీను తెరకెక్కించిన సినిమాల ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఏ సినిమా తీసినా అట్టర్ ఫ్లాప్ [more]

Update: 2019-04-18 07:24 GMT

శ్రీను వైట్లతో సినిమా అంటేనే హీరోలంతా ఆమడ దూరం పారిపోతున్నారు. ఈమధ్యన శ్రీను తెరకెక్కించిన సినిమాల ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఏ సినిమా తీసినా అట్టర్ ఫ్లాప్ అవడంతో హీరోలెవరూ శ్రీను వైట్లకి ఛాన్స్ ఇచ్చేలా కనబడడం లేదు. కానీ తనకి గతంలో హిట్ ఇచ్చిన మంచు విష్ణు, శ్రీను వైట్లకి మరో ఛాన్స్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాడు. ప్రస్తుతం తన కెరీర్ కూడా ఇబ్బందుల్లోనే ఉంది. విష్ణు నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతున్నాయి. ఆచారి అమెరికా యాత్ర తర్వాత మళ్లీ ఓటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు మార్కెట్ పూర్తిగా శూన్యం. మరి ఇలాంటి సమయంలో ఢీతో తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు విష్ణు.

మనోజ్ ను తీసుకొని…

అయితే ఏమాత్రం క్రేజ్ లేని శ్రీను వైట్ల, క్రేజ్ తగ్గిపోయిన మంచు విష్ణు కలిసి సినిమా చేస్తే ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ ఎలాంటి ఆసక్తి ఉండదు. ఎంతగా శ్రీను వైట్ల – విష్ణు కాంబోలో గతంలో వచ్చిన ఢీకి సీక్వెల్ అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ సినిమా మీద ఎలాంటి హైప్ క్రియేట్ కాదు. అందుకే శ్రీనూ వైట్లకి సన్నిహితులు ఒక ఉచిత సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదేమిటంటే శీను – విష్ణు కాంబోలో రాబోయే సినిమాలో మరో హీరోకి కూడా ప్లేస్ ఇస్తే అప్పుడు సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుతుందని చెబుతున్నారట. అయితే ఆ హీరోగా ఎవరో ఎందుకు… ప్రస్తుతం సినిమాలు వదిలేసి ఖాళీగా ఉన్న మనోజ్ ని విష్ణు సినిమాలో నటింపజేస్తే సినిమాకి క్రేజ్ వస్తుందని శ్రీను వైట్లకి సన్నిహితులు సూచిస్తున్నారట. దీనిపై శ్రీను వైట్ల ఆలోచనలో పడినట్లుగా టాక్.

Tags:    

Similar News