ప్లాప్ డైరెక్టర్ కి మళ్లీ ప్లాప్ హీరోనే దొరికాడా..?

మొన్నామధ్యన ఫ్లాప్ హీరోకి ఫ్లాప్ డైరెక్టర్ అంటూ.. శ్రీను వైట్ల, రవితేజ మీద అమర్ అక్బర్ ఆంటోని ముందు బోలెడన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నిజంగానే ఫ్లాప్ [more]

Update: 2019-02-20 06:35 GMT

మొన్నామధ్యన ఫ్లాప్ హీరోకి ఫ్లాప్ డైరెక్టర్ అంటూ.. శ్రీను వైట్ల, రవితేజ మీద అమర్ అక్బర్ ఆంటోని ముందు బోలెడన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నిజంగానే ఫ్లాప్ డైరెక్టర్ ని పిలిచి రవితేజ అవకాశమివ్వడం నిజంగా సెన్సేషనే. కానీ రవితేజకి మొదట్లో లైఫ్ ఇచ్చిన శ్రీను వైట్లకు రవితేజ సహాయం చేస్తున్నాడని సర్దుకుపోయారు. కానీ రవితేజ నమ్మకాన్ని శ్రీను వైట్ల నట్టేట్లో ముంచేశాడు. అమర్ అక్బర్ ఆంటోని డిజాస్టర్ అయ్యింది. శ్రీను వైట్ల పని అయిపోయిందనే అనుకున్నారు అంతా. కానీ తాజాగా ఈ అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్ కి మరో అట్టర్ ఫ్లాప్ హీరో దొరికాడని న్యూస్ వైరల్ అయ్యింది. గతంలో శ్రీను వైట్ల ఢీ సినిమాతో మంచు విష్ణుకి హిట్ ఇచ్చాడు. జెనీలియా హీరోయిన్ గా శ్రీహరి ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఢీ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యింది. మంచి విష్ణుకి కెరీర్ లో ఎప్పుడో ఒక హిట్ మాత్రమే పలకరిస్తూ వస్తుంది.

మరో ఢీ లాంటి హిట్ అవుతుందా…

ఆచారి అమెరికా యాత్ర సినిమా డిజాస్టర్ తర్వాత మళ్లీ ఇప్పటివరకు మరో సినిమా మాటెత్తకుండా అమెరికా, బిజినెస్ వ్యవహారాల్లో మునిగి తేలుతున్న విష్ణుతో ఇప్పుడు శ్రీను వైట్ల మరో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. ప్రస్తుతం డిజాస్టర్స్ తో ఉన్న మంచు విష్ణుకి సరిపడా కథని శ్రీను వైట్ల రాసుకున్నాడని.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు. మంచు విష్ణు.. శ్రీను వైట్ల కథ మెచ్చి ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చాడనే టాక్ చక్కర్లు కొడుతోంది. మరి శ్రీను వైట్ల – మంచు విష్ణు కాంబోలో వచ్చిన ఢీ సినిమా లానే ఇప్పుడు వీరి కాంబోలో మొదలు కాబోతున్న సినిమా కూడా మంచి హిట్ అవుతుందని.. అలాగే వీరి కాంబో మళ్లీ క్రేజీ కాంబో కావడం ఖాయమంటున్నారు మంచు అభిమానులు.

Tags:    

Similar News