ఈ పని స్టార్టింగ్ లో చేసి ఉంటే బాగుండేది!

Update: 2018-05-16 08:49 GMT

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కానీ, ఇప్పుడున్న జెనరేషన్ హీరోయిన్స్ లో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ తెలుగు హీరోయిన్స్ లేరు. శ్రీదివ్య కు ఛాన్స్ వచ్చినా ఆమె ఆ ఛాన్స్ నిలబెట్టుకోకలేకపోయింది. 'మనసారా' అంటూ మనల్ని పలకరించిన ఈ భామ ఆ తర్వాత కుర్రాళ్లను కేరింతలు కొట్టించేందుకు గట్టిగానే ట్రై చేసింది.

అందాల ఆరబోతకు రెడీ అంట...

మారుతీ డైరెక్షన్ లో 'బస్టాప్' చేసింది. అలాగే 'మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు' గా మారింది. ఆ తర్వాత ఆమెకు సరిగా ఆఫర్స్ రావడం లేదని ఇక్కడ బస్సెక్కి చెన్నైలో వాలింది. అంతే అక్కడ తిరిగి చూస్కోకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్లిపోయింది. అయితే మళ్లీ ఇప్పుడు ఏం అనుకుందో ఏమో కానీ మళ్లీ ఆమె కళ్లు టాలీవుడ్ మీద పడ్డాయి. టాలీవుడ్ సినిమాలకు అవసరమైన గ్లామర్ రోల్స్ కూడా చేస్తానంటూ ఆఫర్లు ఇస్తోంది.

వల వేస్తున్న అంజలి, బింధు మాదవి...

స్టార్టింగ్ లో ఏమైనా అందాల ఆరబోత క్యారెక్టర్లు చేస్తే క్రేజ్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను రెడీ అంటే ఆమెను పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు రెడీగా ఉండాలి కాదా! చూద్దాం మరి మన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆమె ఆఫర్ నచ్చి ఆమెను తీసుకుంటారేమో. మరోపక్క శ్రీదివ్య లాగా అంజలి, బింధు మాదవి వంటి భామలు కూడా టాలీవుడ్ పై వలలు వేస్తున్నారు. కాని ఇప్పుడున్న టఫ్‌ కాంపిటీషన్లో అది కుదిరే పనేనా?

Similar News