అతడి వల్లనే బిగ్ బాస్ లోకి రాలేదట

బిగ్ బాస్ ప్రస్తుతం అయితే యమా.. హాట్ గా జరుగుతుంది. ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు కానీ గతం వారం మాత్రం ఎవరు [more]

Update: 2019-09-04 13:04 GMT

బిగ్ బాస్ ప్రస్తుతం అయితే యమా.. హాట్ గా జరుగుతుంది. ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు కానీ గతం వారం మాత్రం ఎవరు ఎలిమినేట్ కాలేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో ఫేడవుట్‌ అయిన యాంకర్‌ శిల్ప చక్రవర్తి రావడంతో షాక్‌ తగిలింది బిగ్ బాస్ వ్యూయర్స్ కి. గత కొన్ని రోజులు నుండి హౌస్ లోకి హెబ్బా పటేల్‌, ఈషా రెబ్బా, శ్రద్దా దాస్ వస్తారు అని చాలామంది ఆశ పడ్డారు కానీ అవి ఏమీ జరగలేదు.

వరుణ్ సందేశ్ వల్లనేనా?

వైల్డ్ కార్డు రూపంలో గ్లామర్ బ్యూటీ శ్రద్దా వస్తుంది అని చాలామంది అనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ చివరి నిమిషం లో ఆమె వరుణ్ సందేశ్ ఉంటే నేను బిగ్ బాస్ రాను. అతను ఎలిమినేట్ అయితేనే వస్తాను అని చెప్పింది. ఎందుకంటే గతంలో వీరిద్దరూ ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే. అప్పటిలో వీరి ఎఫైర్‌ చాలా వైరల్ అయింది. వరుణ్ తో బ్రేక్ అప్ తరువాత శ్రద్దా అప్పటిలో డిప్రెషన్‌కి గురయిందని వార్తలు వచ్చాయి. ఇక వరుణ్ ఇప్పటిలో ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. దీంతో బిగ్ బాస్ టీం చివరి నిమిషం లో ఎవరూ దొరకక శిల్ప చక్రవర్తితో మ.మ. అనిపించేసారట. ఒకవేళ వరుణ్ అప్ కమింగ్ వీక్స్ లో ఎలిమినేట్ అయితే శ్రద్దా వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News