ప‌వ‌న్ కు అభిమాని బర్త్ డే స్పెషల్ గిఫ్ట్

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌ర్థమాన క‌వి ర‌త్నకిశోర్ శంభుమహంతి ర‌చించి,స్వర‌ప‌రిచి,ఆల‌పించిన ప్రత్యేక గీతం విడుద‌లైంది.సామాజిక మాధ్యమాల ద్వారా ర‌చ‌యిత ఈ పాట‌ను అందించారు.ఈ [more]

Update: 2019-08-30 12:11 GMT

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌ర్థమాన క‌వి ర‌త్నకిశోర్ శంభుమహంతి ర‌చించి,స్వర‌ప‌రిచి,ఆల‌పించిన ప్రత్యేక గీతం విడుద‌లైంది.సామాజిక మాధ్యమాల ద్వారా ర‌చ‌యిత ఈ పాట‌ను అందించారు.ఈ సంద‌ర్భంగా ర‌త్నకిశోర్ స్పందిస్తూ..రేలారే రేలా జాన‌కీ రావు నేతృత్వాన త్వర‌లో ఆరంభం కానున్న ఆర్జే ఫోక్ ప‌ల్లె పాట‌ల ప్రభంజ‌న వీచిక అనే యూ ట్యూబ్ ఛానెల్ కు ఈ పాట‌ను రూపొందించామ‌ని, ప‌వ‌న్ బ‌ర్త్ డే ను పుర‌స్కరించుకుని దీనిని అభిమానుల కోసం విడుద‌ల చేశామన్నారు.

యూట్యూబ్ ఛానల్ లో…..

క‌ళింగాంధ్ర అస్తిత్వ ప్రతినిధిగా ఈ ప్రాంత స‌మ‌స్యలు ఎలుగెత్తుతూ,సంస్కృతిని ప‌రిర‌క్షిస్తూ,స‌క‌ల జ‌నుల సౌభాగ్యాన్నీ కోరుతూ..రేలారే రేలా జాన‌కీ రావు నేతృత్వాన రానున్న ఈ యూ ట్యూబ్ ఛానెల్ ప్రతి ఒక్కరి ఆద‌రాన్ని, అభిమానాన్ని పొందాల‌న్నదే తన అభిమతం అ ని అన్నారు.ఛానెల్ నిర్వాహ‌కులు, వ‌ర్థమాన జాన‌ప‌ద గాయ‌కులు రేలారే రేలా జాన‌కీ రావుకు, ఇత‌ర బృందానికి ప్రత్యేక అభినంద నలు తెలిపారు.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ..మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని ఆకాంక్షిం చారు.

Tags:    

Similar News