అసలు పూజా ని ఎందుకు తీసుకున్నారు

తమిళ సినిమా జిగర్తాండ చిత్రానికి తెలుగులో రీమేక్ గా వస్తున్నా చిత్రం వాల్మీకి టీజర్ నిన్ననే రిలీజ్ అయి సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఇందులో వరుణ్ [more]

Update: 2019-08-16 09:38 GMT

తమిళ సినిమా జిగర్తాండ చిత్రానికి తెలుగులో రీమేక్ గా వస్తున్నా చిత్రం వాల్మీకి టీజర్ నిన్ననే రిలీజ్ అయి సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఇందులో వరుణ్ తేజ్ ఫుల్ గడ్డంతో, ఉంగరాల జుట్టుతో, నల్లని బట్టలతో కరుడుగట్టిన రౌడీలా భయంకరంగా ఉన్నాడు. ఇందులో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.

ప్రత్యేక పాత్రను క్రియేట్ చేశారా?

ఒరిజినల్ గా తమిళ చిత్రంలో బాబీ సింహ చేసిన పాత్రను వరుణ్ చేస్తుండగా, హీరో సిద్దార్ద్ చేసిన ఫిలిం డైరెక్టర్ పాత్రను అధర్వ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశర్యం కలిగించే అంశం ఏంటంటే అధర్వ లవర్ గా మృణాళిని తీసుకున్నారు. మరి పూజా హెగ్డే ని ఏ పాత్ర కోసం తీసుకున్నారో అనేది ఆసక్తికర విషయం. ఎందుకంటే ఒరిజినల్ మూవీ జిగర్తాండలో బాబీ సింహ పాత్రకు హీరోయిన్ ఉండదు. మరి ఇక్కడ వరుణ్ తేజ్ కి జోడిగా పూజ ని తీసుకున్నారా? లేదా ఆమె కోసం హరీష్ శంకర్ సపరేట్ గా పాత్ర ఏమైనా రాశాడా అనేది ఆసక్తికరం. ఈమూవీ అన్ని అంచనాల మధ్య వచ్చే నెల 13న విడుదల కానుంది.

Tags:    

Similar News