పెళ్లి షాపింగ్ లోను క్లివేజ్ అందాలు!!

Update: 2018-04-19 09:20 GMT

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నా... రిసెప్షన్ కి మాత్రం అటు బాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఇటు క్రికెటర్స్ ని పిలిచారు. మరో బాలీవుడ్ జంట దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ లు పెళ్లి కూడా ఈ ఏడాది జరగొచ్చని... ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయని... కానీ వీరి పెళ్లి కూడా గుట్టు చప్పుడు కాకుండా జరగొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే మరో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా పెళ్లి పీటలెక్కేస్తుంది. సుదీర్ఘ కాలంగా ప్రేమిస్తున్న ఆనంద్ అహూజాను సోనమ్ వివాహం చేసుకోనుంది.

అనిల్ కపూర్ ఇంట.....

అప్పుడే అనిల్ కపూర్ ఇంట పెళ్లి బాజాలు స్టార్ట్ ఆయాయ్యి కూడా. చాలాకాలంగా సోనమ్ - ఆనంద్ అహూజాను ప్రేమలో మునిగితేలుతూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించిన ఈ జంట పెళ్లికి ముస్తాబు అవుతుంది. మరో 20 రోజుల్లోనే సోనమ్ - ఆనంద్ అహూజా ల వివాహాన్ని అనిల్ కపూర్ అంగరంగ వైభవంగా జరపనున్నారు. వచ్చేనెల 12 వ తారీఖున జరగబోయే పెళ్లికోసం ఇప్పటినుండే సోనమ్ ఇంట సంగీత్ కి కావాల్సిన ప్రాక్టీస్ బాలీవుడ్ కొరియోగ్రాఫేర్ ఫరాహ్ ఖాన్ సమక్షంలో మొదలయ్యాయి.అలాగే పెళ్లి షాపింగ్ అంటూ సోనమ్ కుటుంబం అంతా హడావిడి మొదలెట్టేసింది. అయితే ఫ్యాషన్ ఐకాన్ గా వెలుగొందుతున్న సోనమ్ కపూర్ తన పెళ్లి షాపింగ్ కూడా ఒక రేంజ్ లో చేపట్టింది.

దుబాయ్ లో షాపింగ్......

ముంబై లో జరగబోయే తన పెళ్లి కోసం సోనమ్ కపూర్ దుబాయ్ లో షాపింగ్ చేస్తుంది. అక్కడ మ్యారేజ్ షాపింగ్ లో తెగ హడావిడిగా గడిపేస్తున్న ఈ సుందరి...... బుర్జ్ ఖలీఫాలో షాపింగ్ చేసేస్తోంది. కొన్ని బ్రాండ్ రిలేటెడ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది. మరి అక్కడ బుర్జ్ ఖలీఫాలో షాపింగ్ చేస్తున్న సోనమ్ అక్కడినుండి ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరో పోస్ట్ చేసిన ఆ పిక్ ని చూస్తుంటే అందరికీ మతి పోవాల్సిందే. అంతగా క్లీవేజ్ అందాలను కెమేరా ముందు పెట్టేసింది సోనమ్ కపూర్. పెళ్లి షాపింగ్ లో కూడా ఇంతలేసి అందాలను ఆరబొయ్యడం ఒక్క సోనమ్ వల్లే అవుతుందేమో అన్నట్టుగా ఉంది ఈ సుందరి వ్యవహారం.

Similar News