సోనల్ ఎంటమ్మ ఇది

Update: 2018-12-03 04:08 GMT

మన హీరోయిన్స్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్న లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా ఒక మనిషిని ప్రపంచం వ్యాప్తంగా తెలియజేసేలా చేస్తుంది. హీరోయిన్స్ ప్రస్తుతం పేస్ బుక్.. ట్విట్టర్ కన్న ఇన్స్టా గ్రామ్ అకౌంట్ బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో సోనల్ చౌహన్ కొంచం ముందు ఉంది.

బోయపాటి - బాలయ్య కాంబో లో వచ్చిన 'లెజెండ్' సినిమాతో తెరకు పరిచయం అయిన సోనల్ కి తన నెక్స్ట్ సినిమా 'డిక్టేటర్' లో కూడా ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. బాలయ్య లాంటి సీనియర్ హీరోతో చేసిన ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. 'సైజ్ జీరో'లో చేసిన చిన్న పాత్ర అంత ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఆమె ఇంకా ఇలా వర్క్ అవుట్ అవ్వదని హాట్ హాట్ ఫొటోస్ దిగి తన సోషల్ మీడియా అకౌంట్ షేర్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంది.

బీచ్ వొడ్డున కొంచం తడిసిన బట్టలతో ఇసుక తిన్నెల్లో తన్మయత్వంతో కళ్ళు మూసుకుని వాడిపోయిన చెట్టు బెరడుకు తల ఆనించి సన్ గ్లాసెస్ పెట్టి చాలా స్టైలిష్ గా ఫోటో దిగింది. హాట్ హాట్ గా కనిపిస్తున్న ఈ పిక్ తో తన ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. ఇటువంటి స్టిల్స్ ఇవ్వడం సోనాల్ కి కొత్తేమి కాదు కానీ ఇంత హాట్ గా మాత్రం ఈమధ్య కాలంలో ఇవ్వలేదు. సోనాల్ బాలీవుడ్ లో లేటెస్ట్ గా చేసిన ఏ సినిమాలు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతోనే ఎలా ఐన అందరి ద్రుష్టి తనపై పడాలనే ఈ ప్రయత్నం అంత.

Similar News