ఈ హీరోయిన్స్ సర్దుకున్నట్టేనా?

మన తెలుగు హీరోయిన్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే సినిమాలు చేస్తే వరస పెట్టి చేస్తారు లేదా ఖాళీగా కూర్చుంటారు. ఖాళీగా కూర్చోకుండా ఫోటోషూట్స్ చేస్తూ ఎంతో కొంత [more]

Update: 2019-07-10 06:45 GMT

మన తెలుగు హీరోయిన్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే సినిమాలు చేస్తే వరస పెట్టి చేస్తారు లేదా ఖాళీగా కూర్చుంటారు. ఖాళీగా కూర్చోకుండా ఫోటోషూట్స్ చేస్తూ ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. వీరిలో మొదటి ప్లేస్ లో ఉంది ప్రగ్యా జైశ్వాల్, లావణ్య త్రిపాఠి. వీరికి ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక హాట్ ఫొటోస్ తో దర్శనమిస్తున్నారు. వీటితోనే వీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు.

కంచె సినిమాతో పాపులర్ అయిన ప్రగ్యా జైశ్వాల్ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోస్ కంటిలో పడలేకపోయింది. దాంతో ఆమెకు చిన్నచిన్న సినిమా అవకాశాలే వచ్చాయి. చివరిగా ఆమె చేసిన ఆచారి అమెరికా యాత్ర డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఆమెకు ప్రస్తుతం సినిమాలు లేవు.

అలానే లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. అందాల రాక్షసితో యూత్ ని ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ స్టార్ డమ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. గత రెండేళ్ల నుండి ఈమెకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదంటే కొంచం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈమె ప్రస్తుతం నిఖిల్ తో అర్జున్ సురవరం మాత్రమే చేస్తుంది. ఈమె చేతిలో మరో సినిమా లేదు. ఒకేవేళ ఈసినిమా హిట్ అయిన ఈమెను పట్టించుకోవడం చాలా కష్టం.

ఈ లిస్ట్ లోనే హెబ్బాపటేల్, షాలినీ పాండే కూడా ఉన్నారు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ హీరోయిన్స్ స్టార్ డం రావడంలేదు. వీరి చితిలో కూడా సినిమాలు లేకపోవడంతో ఎక్కువగా ఫొటో షూట్స్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. అలానే వీరితో పాటు ప్రణీత, ప్రియాంక జవాల్కర్ లాంటి కొంతమంది భామలు కూడా సినిమా లేక ఫోటో షూట్స్ కె పరిమితం అయ్యారు.

Tags:    

Similar News