సంక్రాంతి సందడి మామూలుగా లేదు..!

Update: 2018-12-08 09:34 GMT

వచ్చే సంక్రాంతికి సినిమాల హావా అప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ మూడు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి. డేట్స్ కూడా ప్రకటించాయి. మరో రెండు సినిమాలు డేట్స్ ను త్వరలోనే ప్రకటించనున్నాయి. లిస్ట్ లో మరో 2 సినిమాలు కూడా చేరే ఛాన్స్ ఉంది. సంక్రాంతి పండగకి తెలుగు రాష్ట్రాల్లో సెలవులు కావడంతో దాన్ని కాష్ చేసుకునేందుకు చాలామంది దర్శకనిర్మాతలు ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందుగా 'ఎన్టీఆర్' బయోపిక్ రానుంది. బాలయ్య లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ మరో 10 రోజుల్లో ముగియనుంది.

వరుసకట్టి వస్తున్నాయి...

'ఎన్టీఆర్' బయోపిక్ వచ్చిన రెండు రోజుల తరువాత రామ్ చరణ్ - బోయపాటిల సినిమా 'వినయ విధేయ రామ' జనవరి 11న విడుదల అవ్వబోతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'వినయ విధేయ రామ' వచ్చిన తరువాత రోజు అంటే జనవరి 12న దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ - వరుణ్ తేజ్ నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎఫ్-2' విడుదల అవుతుంది. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూడింటితో పాటు లిస్ట్ లోకి మరో రెండు సినిమాలు చేరే అవకాశం ఉంది. తమిళ డబ్ మూవీస్ కూడా ఒకటి రెండు రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. అంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదంట..

Similar News