వీటన్నటికీ ప్రమోషనే ప్రాబ్లమా..?

Update: 2018-08-08 06:36 GMT

వారానికి అరడజను చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్దకు రావడం.. అందులో కొన్ని సినిమాల్లో సరైన కంటెంట్ లేక ప్రేక్షకులు ఉసూరుమంటున్నారు. ఎక్కడో చిన్నాచితక సినిమా హిట్ అయినా ఆ సినిమాకి కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఒక సినిమాని హిట్ అని ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా ఓవరాల్ గా మంచి మార్కులు వేసినా సినిమా కలెక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రం తుస్ మంటున్నాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణ సుశాంత్ నటించిన చి.ల.సౌ సినిమానే. ఆ సినిమాకి అక్కినేని కాంపౌండ్ బ్యాగ్రౌండ్ ఉంది.. అలాగే సినిమా విడుదలయ్యాక పాజిటివ్ అంటే హిట్ టాక్ వచ్చింది. అలాగే విమర్శకులు సైతం సినిమాని బాగుందన్నారు. కానీ.. చివరికి మిగిలింది ఏమిటి..?

హిట్ టాక్ తెచ్చుకున్నా...

అయితే ఇలా కేవలం చి. ల.సౌ సినిమా విషయంలోనే జరగలేదు. ఇలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన బోలెడన్ని చిన్న సినిమాలు హిట్ టాక్ వచ్చి హిట్ అయినా.. కలెక్షన్స్ డల్. అలా అయిన వాటిలో.. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నది ఒకే కథ, అలాగే లేటెస్ట్ గా సుధీర్ బాబు సమ్మోహనం సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలన్నిటికీ క్రిటిక్స్, ప్రేక్షకులు కూడా పాజిటివ్ మార్కులు వేసినా సినిమా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంచి కంటెంట్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమాలకు ఇలా కలెక్షన్స్ తక్కువ రావడానికి కారణం ఏదో ఉంది.

ప్రమోషన్స్ చేయలేకే...

ఆ ఏదో అనేది ప్రమోషన్స్ అనే టాక్ మాత్రం ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినబడుతుంది. స్మమోహనం సినిమాకి సుధీర్ బాబు బావ మహేష్ వంటి వారు సినిమా విడుదలకు ముందు... అయ్యాక కూడా మీడియా ప్రమోషన్స్ లో, ఆన్ లైన్ ప్రమోషన్స్ లో జోరు చూపించినా సుధీర్ బాబు - ఇంద్రగంటికి ఒరిగింది లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీ హ్యాండ్ వేసినా చి.ల.సౌ పరిస్థితి అంతే. అయితే ఇలా చిన్న సినిమాలు హిట్ అయినా కలెక్షన్స్ రాకపోవడానికి వాటికి సరైన ప్రమోషన్స్ లేవనే టాక్ వినబడుతూనే. ఎంతగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసిన సినిమాలకు హైప్ రాదని.. బి, సి సెంటర్స్ ని ఆకట్టుకోవాలంటే... కాలేజ్ లకి, అలాగే పలు ఊర్లలో థియేటర్స్ కి వెళ్లి సినిమా టీమ్ మొత్తం ప్రమోట్ చేస్తే ఇలాంటి సినిమాలకు కేవలం హిట్ అనే పేరే కాదు.. మంచి కలెక్షన్స్ కూడా దక్కుతాయనే భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Similar News