ఉప్సి ఆంటీ అంటూ అదరగొట్టేసిందిగా..!

Update: 2018-07-21 09:14 GMT

టాలీవుడ్ లో నిన్న ఇద్దరు స్టార్స్ ఇంట్లో బర్త్ డే వేడుకలు జరిగాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో బర్త్ డేలు జరుపుకున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన బర్త్ డే నిన్న ఘనంగా జరపగా... మరోవైపు మహేష్ బాబు తన గారాలపట్టి సితార బర్త్ డే చాలా ఆనందంగా జరుపుకున్నారు.

వీడియోలో మనస్సులో మాట

ముందుగా నిన్న ఉపాసన బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో చరణ్ తన భార్యను ఉదేశిస్తూ... ‘నువ్వు దయాగుణం గల వ్యక్తివి. నువ్వు ఫెంటాస్టిక్, అమేజింగ్, బ్యూటిఫుల్.. నా పక్కన ఉంటే మరింత సంతోషంగా ఉంటాను. హ్యాపీ బర్త్ డే మై లవ్’ తన మనసులో మాటలను వీడియో రూపంలో చెప్పాడు.

థ్యాంక్స్ ఉప్సి ఆంటీ..చరణ్ అంకుల్...

ఇక అదే రోజు మహేష్ బాబు కూతురు సితార బర్త్ డే కావడంతో...మహేష్ తన ఇంట్లోనే సితార బర్త్ డే ఘనంగా నిర్వహించాడు. మహేష్ కూతురు బర్త్ డే సందర్భంగా చరణ్ స్పందిస్తూ...‘త్వరలోనే నిన్ను కలుస్తాను.. నువ్వు నా కోసం పాట పాడాలి’ అని చెప్పాడు. అంతేకాదు బర్త్ డే గర్ల్ సితార కూడా రిప్లయ్ ఇస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. " టాంక్యూ ఉప్సి( ఉపాసన ) ఆంటీ అండ్ థాంక్యూ చరణ్ అంకుల్ నాకు బర్డ్స్ గిఫ్ట్ గా ఇచ్చినందుకు" అని చాలా క్యూట్ గా ముద్దుముద్దుగా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Similar News