సినీ రచయితపై లైంగిక ఆరోపణలు

Update: 2018-10-10 11:16 GMT

కోలీవుడ్ లో ప్రముఖ సినీ రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేశారు. #మీటూ పేరిట వివిధ రంగాల్లోని మహిళలు ప్రముఖులతో వారు ఎదుర్కొన్న లైంగిక వేదింపులను బహర్గతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏనిమిదేళ్ల వయస్సులోనే లైంగిక వేదింపులకు గురయ్యానని మూడురోజుల క్రితమే చెప్పి సింగర్ చిన్మయి తాజాగా వైరముత్తుపై ట్విట్టర్ లో ఆరోపణలు చేశారు. ‘‘2005 లేదా 2006 సమయంలో ఓ కార్యక్రమం కోసం స్విట్జర్ ల్యాండ్ వెళ్లగా కార్యక్రమం ముగిసిన తర్వాత బృంద సభ్యులు అందరినీ పంపించినా నన్ను, నా తల్లిని మాత్రం పంపించ లేదు. నిర్వాహకులను అడిగితే ఒకసారి వైరముత్తు హోటల్ కి వెళ్లమని చెప్పారు. ఆయన హోటల్ రూంకి వెళితే నన్ను లోబర్చుకోవాలని చూశాడు. నేను ఒప్పుకోకుండా తప్పించుకుని వచ్చేశాను. ఇక నీకు భవిష్యత్ ఉండదు అని హెచ్చరించారు. అయినా పట్టించుకోలేదు.’’ అని తనకు ఎదురైన వేదింపులను ఆమె బహిర్గతం చేశారు. తర్వాత మరోసారి కూడా వైరముత్తు ఇటువంటి ప్రయత్నమే చేశాడని ఆమె ఆరోపించారు.

జాతీయ అవార్డు అందుకుని...

తమిళనాట ప్రముఖ సినీ రచయితల్లో ఒకరైన వైరముత్తుకు సినీ రంగంలో, రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇక చిన్మయి తో పాటు మరో అమ్మాయి కూడా వైరముత్తుపై ఇవే ఆరోపణలు చేసింది. వీరికి నటుడు సిద్ధార్థ్ మద్దతు తెలిపాడు. ఒకే వ్యక్తిపై ఇద్దరు ఆరోపణలు చేస్తున్నందున వారి వాదనను వినాలని సిద్ధార్థ్ పేర్కొన్నారు. చిన్మయి వంటి మంచి స్థాయిలో ఉన్నవారు అసత్య ఆరోపణలు చేయరని ఆయన అన్నారు. ఇక వైరముత్తు చెన్నైలో ఓ లేడీస్ హాస్టల్ కూడా స్థాపించి తన మనవరాళ్ల వయస్సు ఉండే అక్కడి అమ్మాయిలతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Similar News