టాలీవుడ్ ను షేక్ చేయనున్న కొత్త అత్త ..!

Update: 2018-04-11 11:42 GMT

అత్తారింటికి దారేది సినిమాలో నదియా పవన్ కళ్యాణ్ కి యంగ్ అత్తగా నటించి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నదియాకి మిర్చి ఇలా మరికొన్ని మంచి ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఆ తరవాత చాలామంది మాజీ హీరోయిన్స్ అత్తలుగా మారడానికి రెడీ అయ్యారు. నా అల్లుడు సినిమాతో ఎన్టీఆర్ కి అత్తగా రమ్యకృష్ణ నటించింది. అయితే నిన్నటితరం హీరోయిన్ అయిన మరొకరు ఇప్పుడు కొత్తగా అత్త అవతారమెత్తబోతుంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోస్ పక్కన నటించిన సిమ్రాన్ ఇపుడు టాలీవుడ్ లోకి అత్త పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి, డాడీ, బావ నచ్చాడు సినిమాల్తో అప్పట్లో ఉర్రుతలూగించిన సిమ్రాన్ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక సినిమాలకు దూరమైంది . అయితే పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యాకా మళ్ళీ నటన గురించి ఆలోచించిన సిమ్రాన్ తమిళంలో ఎప్పుడో రీ ఎంట్రీ ఇచ్చినా... టాలీవుడ్ కి మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు ఒక టాలీవుడ్ సినిమాలో తన వయసుకు తగ్గట్టుగా అత్త పాత్ర చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈమధ్యన కమెడియన్ సప్తగిరి హీరోగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సప్తగిరి ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది.

అయితే ఇది అత్తకి తగిన అల్లుడు తరహాలో కొనసాగే కథనట. అందువల్లనే అత్త పాత్ర కోసం సిమ్రాన్ ను సంప్రదించగా ఓకే చెసినట్టు తెలుస్తోంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా.... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది .. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోయే సినిమాలో సిమ్రాన్ దాదాపుగా అత్త పాత్రకి ఖాయమంటున్నారు. చూద్దాం సప్తగిరి అత్తగా సిమ్రాన్ ఏ మేర ఆకట్టుకుంటుందో అనేది.

Similar News