సైమా అందాలు అదరహో...!

Update: 2018-09-16 06:00 GMT

ప్రతియేటా దుబాయ్ వేదికగా... సౌత్ ఇండస్ట్రీ అంటే.. టాలీవుడ్, కోలీవడ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ లకు సంబందించిన నటీనటులకు సైమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతియేడు సెప్టెంబర్ లో జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన ఆవార్డుల వేడుకకి హీరో, హీరోయిన్స్, విలన్ కేరెక్టర్స్ చేసిన నటులు, సపోర్టింగ్ కేరెక్టర్స్ చేసిన నటులు అంతా ఎంతో ముచ్చటగా ఎంజాయ్ చేస్తూ దుబాయ్ కి ఫ్లైట్ ఎక్కేసి మరీ ఈ సైమా అవార్డుని అందుకుంటారు. కొంతమంది అవార్డులు అందుకోవడం కోసం హాజరైతే.. మరికొందరు మాత్రం ఆ అవార్డుల వేడుకలో డాన్స్ పెరఫార్మెన్సెస్ కోసం హాజరవుతారు. ఇంకొందరు ఆ అవార్డుల వేడుకలో హడావిడి చేసి అందరి చూపుని తమ మీద పడేలా అందంగా ఆకర్షణగా తయారై సైమా కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు.

సైమా వేడుకల్లో......

తాజాగా 2018 సైమా వేడుక దుబాయ్ లో అంగరంగ వైభవంగా మొదలైంది. ఇక ఈ వేడుకకి హాజరవుతున్న హీరోయిన్స్ మాత్రం సీతాకోక చిలుకల్లాంటి డ్రెస్సులు వేసుకుని తమ అందాలను ఆరబోస్తున్నారు. శ్రియ, హన్సిక, కీర్తి సురేష్, అదితి రావు, ఇషా రెబ్బ, సంజన, నిక్కీ గల్రాని, ప్రగ్య జైస్వాల్, శ్యాన్వి ఇంకా చాలామంది టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, మలయాళ భామలు అదిరిపోయే అందమైన డిజైనర్ డ్రెస్సులతో అందాలు ఆరబోస్తూ.. క్లివేజ్ షోతో మతులు పోగొడుతూ.. గ్లామర్ అంటే ఇదే అంటూ ఎలా చెలరేగిపోయి సైమాకి హజాయిన సౌత్ భామలను చూస్తే తెలుస్తుంది.

డిజైనర్ డ్రస్సులతో.....

డిజైనర్ డ్రెస్సులతో.. క్లివేజ్ అందాలతో... అందమైన భామలు అదరహో అనిపించారు. మరి సౌత్ హీరోయిన్స్ ఆరబోసే అందాలు సైమా అవార్డుల వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సీత కోకచిలుకల గుంపు ఒకే చోట చూస్తే ఎంతందంగా ఉంటుందో.. సైమాకి హాజరయిన హీరోయిన్స్ ని చూస్తే అంటే అందమైన ఫీలింగ్ రావడం ఖాయం. ఇక సైమా 2018 రెడ్ కార్పెట్ అందాలు అంటూ హ్యాష్ టాగ్ తో సౌత్ హీరోయిన్స్ అదరగొట్టేస్తున్నారు. పొడుగైన గౌనులలో తమ అందాల ఆరబోతకు ఇలాంటి అవార్డు ఫంక్షన్స్ కేరాఫ్ అడ్రెస్స్ అంటున్నట్టుగా ఉంది ఈ భామల వరస చూస్తే... మరి మీరూ సైమా అందాలు ఓ లుక్కెయ్యండి.

Similar News