శింబు తప్పుకున్నాడు… సిద్ధార్థ్ వచ్చాడు

అప్పట్లో ‘భారతీయుడు’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా శంకర్ ‘భారతీయుడు 2’ను తీస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ [more]

Update: 2019-01-18 07:52 GMT

అప్పట్లో ‘భారతీయుడు’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా శంకర్ ‘భారతీయుడు 2’ను తీస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటించబోతుంది. సేతుపతి పాత్రలో శింబు నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం శింబు ఆ పాత్రలో నటించట్లేదు అని తెలుస్తుంది. శింబు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిని చూపలేదని, అందుకే ఆయనకి బదులుగా సిద్ధార్థ్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

సిద్ధార్థ్ కి కలిసొచ్చిన అవకాశం

మరి శింబు ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ లో చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదో అర్థం కావట్లేదు. ఒకవేళ ఇది నిజం అయ్యి సిద్ధార్థ్ కి ఛాన్స్ వస్తే… అది ఆయన కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ చేతిలో సినిమాలు ఏమీ లేవు. కెరీర్ పరంగా కూడా సిద్ధార్థ్ చాలా వెనకపడి ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాతో కంబ్యాక్ అవ్వాలని సిద్ధార్థ్ భావిస్తున్నాడు. అలానే మరో ముఖ్యమైన పాత్రలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు.

Tags:    

Similar News