శ్వేతా బసు ఇంత పెద్ద షాకిచ్చిందేమిటి

నటి శ్వేతా బసు ప్రసాద్ అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఎంత త్వరగా నటిగా మారిందో అంటే త్వరగా ఆమె వెండితెరకు దూరమైంది. టాలీవుడ్ [more]

Update: 2019-12-10 08:31 GMT

నటి శ్వేతా బసు ప్రసాద్ అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఎంత త్వరగా నటిగా మారిందో అంటే త్వరగా ఆమె వెండితెరకు దూరమైంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుంది ఆనుకున్న శ్వేతా బసు.. చివరికి షార్ట్ ఫిలిమ్స్ లో నటించాల్సి వచ్చింది. అయితే మధ్యలో శ్వేతా బసుపై వ్యభిచార ఆరోపణలతో ఆమె కెరీర్ బాగా దెబ్బతింది. మంచు విష్ణు లాంటోళ్ళు శ్వేతా బసుని ఆదుకుంటామని చెప్పినప్పటికీ.. అవన్నీ వాస్తవరూపం దాల్చలేదు. ఇక శ్వేతా కెరీర్ లో వెనకబడడంతో… బాలీవుడ్ లో సీరియల్స్ లో నటించడం స్టార్ట్ చేసింది. ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడే శ్వేతా, రోహిత్ మిట్టల్ ని ప్రేమించడం, గత ఏడాది డిసెంబర్ లో సైలెంట్ గా పెళ్లి కూడా చేసుకుంది.

ఇక అప్పటినుండి శ్వేతా బసు ఊసు మర్చిపోయారు. మీడియా కూడా శ్వేతా మీద ఫోకస్ పెట్టలేదు కానీ తాజాగా శ్వేతా.. భర్త రోహిత్ మిట్టల్ తో విడాకులు తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందరికి షాకిచ్చింది. ఇంకా ఏడాది గడవక ముందే తమ మధ్యన వచ్చిన విభేదాల కారణంగా తామిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నట్టుగా శ్వేతా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. భర్త రోహిత్ మిట్టల్ తనకి సపోర్ట్ చేసేవాడని, కానీ తమ మధ్యన వచ్చిన మనస్పర్థలు తమని విడాకుల వైపు నడిపించావని చెప్పి అందరిని షాక్ లో పడేసింది. ఎంత వేగంగా శ్వేతా పెళ్లి, లైఫ్ అంటూ దిగిందో కెరీర్ మాదిరిగానే అంతే వేగంగా డివోర్స్ తీసుకోవడం బాధాకరమని చెప్పాలి

Tags:    

Similar News