చిరు పక్కన శృతి చేస్తుందా..?

కమల్‌ హాసన్‌, చిరంజీవి ఇద్దరూ సమానమైన నటులు. కమల్ హాసన్ కూతురు అంటే చిరంజీవికి కూడా కూతురుగానే లెక్కే. అయినా గ్లామర్ ఫీల్డ్ లో ఇటువంటివి పటించుకోలేం. [more]

Update: 2019-03-08 09:02 GMT

కమల్‌ హాసన్‌, చిరంజీవి ఇద్దరూ సమానమైన నటులు. కమల్ హాసన్ కూతురు అంటే చిరంజీవికి కూడా కూతురుగానే లెక్కే. అయినా గ్లామర్ ఫీల్డ్ లో ఇటువంటివి పటించుకోలేం. సమయం వచ్చినప్పుడు చిరంజీవి పక్కన కూడా నటించాలి వస్తుంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో నటించిన కాజల్ చిరంజీవితో కూడా చేసింది. అయితే అసలు విషయం ఏంటంటే చిరంజీవి సినిమాలో ఒక కీలక పాత్రకి శృతి హాసన్‌ని అడిగారట. చిరంజీవితో కొరటాల శివ ఓ సినిమా చేయనున్నాడు.

ఒకే చెబుతుందా మరి…

అందులో ఒక ఇంపార్టెంట్‌ లేడీ క్యారెక్టర్‌ ఉందట. దానికి టాప్ హీరోయిన్ అయితే బాగుంటందని భావించి శృతిహాసన్‌ పేరు అనుకున్నారట. కొరటాల శివతో శ్రీమంతుడు, రామ్ చరణ్ తో చేసిన పరిచయం ఉంది కాబట్టి ఆమెనే తీసుకుందామని అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన శృతి ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెపుతుందా? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. సెట్స్ మీదకు వెళ్లే లోపల ఆమెను తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.

Tags:    

Similar News