సీనియర్ హీరో కూడా హ్యాండ్ ఇచ్చాడా..?

శృతి హాసన్ ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది. తెలుగులో కాటమరాయుడు సినిమాతో మళ్లీ కనబడని ఈ భామ బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసినా ఓ అన్నంత క్రేజ్ [more]

Update: 2019-04-03 10:04 GMT

శృతి హాసన్ ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది. తెలుగులో కాటమరాయుడు సినిమాతో మళ్లీ కనబడని ఈ భామ బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసినా ఓ అన్నంత క్రేజ్ అయితే ఈ భామకి లేదు. టాలీవుడ్ లో శృతి హాసన్ ఒక సీనియర్ హీరోతో రీఎంట్రీ ఇవ్వబోతోందనే న్యూస్ గత నెలరోజుల్లో మీడియాలో వినబడుతుంది. చిరంజీవి – కొరటాల కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం కొరటాల శృతి హాసన్ పేరును చిరు పక్కన పరిశీలించాడనే టాక్ నడిచింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ పక్కన నటించిన శృతి హాసన్ ని చిరంజీవి కోసం కొరటాల తెస్తున్నాడనే అంతా అనుకున్నారు.

చిరంజీవి సినిమాలోనూ ఛాన్స్ లేదు…

కానీ తాజా సమాచారం ప్రకారం శృతి హాసన్ కి చిరు సినిమా నుండి ఎటువంటి ఆఫర్ రాలేదంట. కొరటాల శివ.. చిరు కోసం శృతి హాసన్ పేరుని పరిశీలించిన మాట నిజమే కానీ చిరు పక్కన శృతి హాసన్ అంతగా నప్పదని భావించి శృతిని హీరోయిన్స్ లిస్ట్ నుండి తీసేశాడని ఫిలింనగర్ టాక్. ఇదే విషయాన్ని శృతి కూడా ఒప్పుకుంది. తనకి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవని, అయితే అవ‌కాశాలు రావ‌డం లేద‌న్న బెంగ లేద‌ని… త‌న దృష్టి పూర్తిగా సంగీతంపైనే ఉంద‌ని అలాగే న‌టిగా త‌న‌కు మ‌రో బ్రేక్ త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని చెబుతుంది. మరి నిజంగానే చిరు పక్కన అవకాశం వచ్చినట్టే వచ్చి తృటిలో తప్పిపోయింది అంటే పాపం శృతి అనాలి కదా..!

Tags:    

Similar News