శృతి హాసన్ కి హాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది!

శృతి హాసన్ తన ఇంగ్లీష్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తరువాత ఇండియా కి వచ్చి వరస అవకాశాలు చేజిక్కించుకుంటోంది.  పలు భాషల్లో పలు సినిమాలు కమిట్ [more]

Update: 2019-06-21 09:07 GMT

శృతి హాసన్ తన ఇంగ్లీష్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తరువాత ఇండియా కి వచ్చి వరస అవకాశాలు చేజిక్కించుకుంటోంది. పలు భాషల్లో పలు సినిమాలు కమిట్ అవుతూ ఉన్న శృతి తమిళం లో విజయ్ సేతుపతి సినిమాతో పాటు తెలుగులో రవితేజ తో మరోసారి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇది ఇలా ఉంటె మన బ్యూటీ కి హాలీవుడ్ నుండి ఒక ఆఫర్ వచ్చింది. అయితే మూవీ ఆఫర్ కాదు. హాలీవుడ్ లో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కొట్టేసింది ఈ ఇండియన్ బ్యూటీ.

అప్పటిలో బాలీవుడ్ హీరోయిన్ క్వాంటికో అనే సిరీస్‌లో నటిస్తే ఎంతగా క్రేజ్‌ వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు శృతి హాలీవుడ్ వాళ్ళ దృష్టిలో పడినట్టు ఉంది. ట్రెడ్‌స్టోన్‌ అనే సిరీస్‌లో శృతి కీలక పాత్ర పోషించనుంది. ఇందులో ఆమె కిరాయి హంతకురాలి పాత్రలో కనిపిస్తుంది. అండర్‌ కవర్‌లో హోటల్‌లో వెయిట్రెస్‌గా కనిపించే పాత్ర లో శృతి నటించనుంది.క్వాంటికోలో నటించిన ప్రియాంక చోప్రా తర్వాత బేవాచ్‌ అనే ఆంగ్ల చిత్రంలో ప్రతినాయిక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అలానే శృతి కి కూడా ఈ సిరీస్ తరువాత ఇంగ్లీష్ సినిమాలో నటించే అవకాశం వస్తుందేమో చూద్దాం. అసలు మన ఇండియన్ హీరోయిన్స్ కి అక్కడ క్రేజ్ ఎక్కువా.

Tags:    

Similar News