ఆమె నా లైఫ్ లో లేదు

Update: 2018-04-29 12:36 GMT

కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ సినిమాల్లో బిజీగా ఉంటూ ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటది. అయితే ఆమె లేటెస్ట్ గా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికర విషయాలపై స్పందించింది. తన జీవితంలో గౌతమి అనే మహిళ లేనేలేదని హీరోయిన్ శ్రుతిహాసన్ పేర్కొంది. కమల్ హాసన్ - గౌతమిలు విడిపోవడానికి కారణం మీరే అన్న ప్రచారంపై స్పందించాలని కోరగా సమాధానం ఇచ్చింది.

తన జీవితంలో లేని ఆవిడ గురించి తాను మాట్లాడదలచు కోవడం లేదని స్పష్టం చేసింది. అలానే మైఖేల్ కోర్సలేతో ఉన్న పరిచయంపై మాట్లాడుతూ, తను స్నేహితుడు మాత్రమేనని, ఆ విషయంపై అంతకన్నా ఏమీ చెప్పలేనని అంది. ఇప్పటిలో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని ఏమన్నా ఉంటె కచ్చితంగా చెప్పే చేసుకుంటా దాచుకోవాల్సిన అవసరమే లేదని చెబుతుంది.

మీ తండ్రి ఆహ్వానిస్తే పాలిటిక్స్ లోకి వస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అవగాహన లేకుండా తాను రాజకీయాల్లోకి వెళ్లబోనని, సమాజానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, రాజకీయ పరిజ్ఞానం పెరిగిన తరువాత ఆలోచిస్తానని వ్యాఖ్యానించింది. చాలా కాలం తర్వాత ప్రస్తుతం కథలు వింటున్న అని త్వరలోనే కొత్త సినిమాకు సంతకం చేస్తానని చెప్పింది. తెలుగు బాషా మాట్లాడేవాళ్లు తన చుట్టూ లేకపోవడంతో బాషా మర్చిపోయని శ్రుతిహాసన్ వ్యాఖ్యానించింది. ఇటీవలే అర్జున్ రెడ్డి సినిమా చూసాను సినిమా నాకు ఎంతగానో నచ్చింది అని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది.

Similar News