ముచ్చటగా మూడో ఆవిడ కూడా?

రాజమౌళి సినిమాలో పాత్ర అంటే చాలు ఎవ్వరైనా ఉబ్బి తబ్బిబ్బవుతారు. మరి ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ [more]

Update: 2020-01-30 06:48 GMT

రాజమౌళి సినిమాలో పాత్ర అంటే చాలు ఎవ్వరైనా ఉబ్బి తబ్బిబ్బవుతారు. మరి ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భీభత్సంగా ఉన్నాయి. ఇండియా మొత్తం రాజమౌళి #RRR గురించి తెగ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కానీ రాజమౌళి మాత్రం #RRR పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా అభిమానుల సహనానికి పరిక్ష పెడుతున్నాడు. షూటింగ్ మధ్యలో లీకుల గోల. అందుకే రాజమౌళి టైట్ సెక్యూరిటీ అంటూ రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో బయటికొస్తుంటే.. తాజాగా #RRR పై బయటికొచ్చినా న్యూస్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా వుంది. అయితే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా నటిస్తుంటే.. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది.

తాజాగా #RRR లోకి మరో భామ ఎంట్రీ ఇవ్వబోతుంది. అంటే ముచ్చటగా మూడో హీరోయిన్ అన్నమాట. ఆమె ఎవరో కాదు.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి లో హీరోయిన్ గ నటించిన శ్రియ కూడా #RRR లో భాగం కాబోతుందట. అయితే ఇద్దరు హీరోలకు హీరోయిన్స్ దొరికేసారు.. ఇక శ్రియతో రాజమౌళి ఏం చెయ్యబోతున్నాడో అనుకున్నోళ్లకి సమాధానం కూడా వచ్చేసింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కి జోడిగా శ్రియ ని రాజమౌళి ఎంపిక చేసినంట్లుగా తెలుస్తుంది. మరి గతంలో అజయ్ దేవగణ్ సరసన కూడా శ్రియ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు వీళ్ళ కెమిస్ట్రీ #RRR లో ఎలా చూపించబోతున్నాడో రాజమౌళి చూడాలి.

Tags:    

Similar News