ఎన్టీఆర్ – చరణ్ కాంబో సీన్స్ లేవంటున్న హీరోయిన్?

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేకిచ్చిన RRR [more]

Update: 2020-09-13 06:43 GMT

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేకిచ్చిన RRR టీం దసరా తర్వాత మల్లీ సెట్స్ మీదకెళ్ళబోతున్నట్టుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాని ఇప్పుడు హీరోయిన్ అలియా సమస్య వెంటాడుతుంది. సుశాంత్ కేసులో స్టార్ కిడ్స్ మీద సోషల్ ఇండియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అలియా భట్ RRR షూటింగ్ కి హాజరయ్యే పనిలా కనిపించడం లేదు. ఇప్పుడు తాజాగా RRR పై హీరోయిన్ శ్రియ ఓ సీక్రెట్ బయటపెట్టింది.

అది శ్రీయ ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్రకి భార్యగా కనిపించనున్నాని.. నా రోల్ నిడివి ఈ సినిమాలో చాలా తక్కువ అని.. ఇక అజయ్ దేవగన్ నైస్ గయ్ అని చెప్పిన శ్రియ శరన్.. తనకి రామ్ చరణ్ అల్లూరి పాత్రతో కానీ, కొమరం బీమ్ ఎన్టీఆర్ తో కానీ కాంబో సీన్స్ లేవని చెప్పింది. అంటే శ్రీయ ఈ సినిమాలో కేవలం కొన్ని నిముషాలు మాత్రమే కనిపిస్తుంది అనిపిస్తుంది. ఇక పాత్ర చిన్నదైనా రాజమౌళి తో ఛత్రపతి తర్వాత మళ్లీ RRR లోనే చేసే అవకాశం దక్కినట్టుగా శ్రియ చెబుతుంది.

Tags:    

Similar News