RRR లో కన్ఫర్మ్.. ఒక్కో హీరో ఒక్కోలా అంటున్న హాటీ!!

స్టార్ హీరోలందరితో జోడి కట్టి పెళ్లి తర్వాత కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతం భర్తతో కలిసి కరోనా లాక్ డౌన్ సమయాన్ని గడుపుతున్న శ్రీయ [more]

Update: 2020-06-08 10:19 GMT

స్టార్ హీరోలందరితో జోడి కట్టి పెళ్లి తర్వాత కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతం భర్తతో కలిసి కరోనా లాక్ డౌన్ సమయాన్ని గడుపుతున్న శ్రీయ శరన్.. ఇంకా స్పైసి గా గ్లామర గా నటించడానికి సిద్ధం అంటుంది. అయితే శ్రీయ RRR లో నటించబోతుంది అనే ప్రచారానికి తెర దించుతూ… తాను RRR లో అజయ్ దేవగన్ కి భార్య గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించబోతున్నా అంటూ RRR లో తాను నటించే విషయాన్నీ కన్ఫర్మ్ చేసింది. ఇక తనతో నటించిన హీరోల గురించి శ్రీయ మనసులో ఏముందో చూసేద్దాం.

ఎన్టీఆర్: ఎన్టీఆర్ తో నా అల్లుడు సినిమాలో నటించిన శ్రీయని ఎన్టీఆర్ గురించి చెప్పంటే.. ఎన్టీఆర్ ఒకప్పుడు  చాలా సైలెంట్‌గా కనిపించేవాడు కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా మారిపోయాడు. ప్రస్తుతం అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందని చెబుతుంది.

ధనుష్: ధనుష్ అద్భుతమైన నటుడు, ఆయనతో నటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంది.

పవన్ కళ్యాణ్: పవన్ చాలా చదువుకున్నాడు. పవన్ తో వర్క్ ఎక్సపీరియెన్స్ చాలా బావుంటుంది.చాలామంచి నటుడు అని చెబుతుంది.
ప్రభాస్: ప్రభాస్ తో కలిసి ఛత్రపతిలో నటించిన శ్రీయకి ప్రభాస్ కళ్ళు అంటే చాలా ఇష్టమట. 

Tags:    

Similar News