బాలీవుడ్ బేబీ ఎవరో తెలుసా?

కొరియన్ సినిమా మిస్ గ్రానీ చిత్రాన్ని తెలుగులో లేడి డైరెక్టర్ నందిని రెడ్డి సమంత హీరోయినా గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మిస్ గ్రానీ చిత్రాన్ని [more]

Update: 2019-06-06 03:31 GMT

కొరియన్ సినిమా మిస్ గ్రానీ చిత్రాన్ని తెలుగులో లేడి డైరెక్టర్ నందిని రెడ్డి సమంత హీరోయినా గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మిస్ గ్రానీ చిత్రాన్ని తెలుగులో ఓ బేబీ గా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్న ఓ బేబీ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. సమంత క్రేజ్ తో ఓ బేబీ సినిమా మీద తెలుగులో భారీ అంచనాలే ఉన్నాయి. సీనియర్ నటి లక్ష్మి ముఖ్య పాత్రలో నాగ శౌర్య హీరోగా ఈ చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సమంత ఈ సినిమాలో క్రేజీ కేరెక్టర్ చేస్తుంది. అందుకే సినిమా మీద మంచి అంచనాలున్నాయి.

తెలుగులో సమంత హీరోయిన్ గా రీమేక్ చేసిన ఈ మిస్ గ్రానీ ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. తెలుగులో ఓ బేబీ గా రీమేక్ చేసిన నిర్మాతలు సురేష్ బాబు వాళ్ళే బాలీవుడ్ లోను ఈ సినిమాని రీమేక్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే తెలుగులో సమంత పోషించిన కేరెక్టర్ ని హిందీలో సాహో బేబీ శ్రద్ధ కపూర్ తో చేయించాలని భావిస్తున్నారట. మరి ఈ సినిమా చెయ్యడానికి శ్రద్ద కపూర్ ఒప్పుకుంటుందో.. లేదో.. అలాగే బాలీవుడ్ లో నిజంగానే ఈ రీమేక్ జరుగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Tags:    

Similar News