ధైర్యం చేసింది…హిట్ కొట్టింది..!

గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన గౌతమ్ తిన్నసూరి – నాని జెర్సీ సినిమా అనుకోని బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఆ రేంజ్ హిట్ ని [more]

Update: 2019-04-29 06:17 GMT

గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన గౌతమ్ తిన్నసూరి – నాని జెర్సీ సినిమా అనుకోని బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఆ రేంజ్ హిట్ ని నాని, దర్శకుడు తిన్నసూరి కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. మొదటి షోకే జెర్సీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నానికి ఎంతగా పేరొచ్చిందో… డైరెక్టర్ గౌతమ్ కి అంతే పేరొచ్చింది. ఇక హీరోయిన్ గా నటించిన శ్రద్ధ శ్రీనాధ్ పేరు కూడా నిన్నమొన్నటి వరకు మీడియాలో మార్మోగడమే కాదు.. అనేకమంది హీరోల కొత్త ప్రోజెక్టులలో శ్రద్ద ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారనే టాక్ నడుస్తుంది. అయితే జెర్సీ సినిమాతో శ్రద్ధ శ్రీనాధ్ సుడి ఆలా తిరగడానికి కారణం.. ముందుగా ఈ సినిమాలో శ్రద్ధ పేరుని దర్శకుడు, హీరో నాని పరిశీలించలేదట.

వేరే హిరోయిన్స్ బయటపడ్డాక…

జెర్సీ సినిమా కోసం గౌతమ్ తిన్నసూరి మరో హీరోయిన్ ని అనుకున్నాడట. అంతేకాకుండా కాస్త పేరున్న హీరోయిన్స్ అయితే సినిమాకి క్రేజొస్తుందని.. అందుకే ఆ టాప్ హీరోయిన్ ని జెర్సీ కోసం సంప్రదించగా.. వారు జెర్సీలో సారా పాత్ర చెయ్యడానికి భయపడ్డారట. మరి ఒకే ఎమోషన్, ఎక్స్ ప్రెషన్ ని మెయింటైన్ చేస్తుండాలి, అలాగే కాస్త ట్రెడిషనల్ గా నటించాలని వెనకడుగు వేశారో లేదా సినిమా మీద నమ్మకం లేకనో కానీ ఆ హీరోయిన్స్ నో చెప్పారట. అయితే ఆ హీరోయిన్స్ కాదని చెప్పాకే.. దర్శకుడు గౌతమ్ శ్రద్ధ శ్రీనాధ్ ని సంప్రదించాడట. మరి సారా పాత్ర చెయ్యడానికి శ్రద్ధ శ్రీనాధ్ ధైర్యంగా ఒప్పుకుని నటించింది. ఆ ధైర్యానికి తగిన ఫలితం దక్కింది. జెర్సీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నానితో పాటు సారా పాత్ర చేసిన శ్రద్ధకి అంతే పేరొచ్చింది. తాజాగా శ్రద్ధ శ్రీనాద్ మరో తెలుగు మూవీని ఓకె చేసిందనే టాక్ ఉంది.

Tags:    

Similar News