రామ్ చరణ్ కోసం శ్రద్ద కపూర్ వస్తుందా..?

Update: 2018-10-25 07:25 GMT

బోయపాటి శ్రీను - రామ్ చరణ్ కాంబోలో మాస్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. వినయ విధేయ రామ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆ టైటిలే పక్కా అంటూ వార్తలొసున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. దసరా కానుకగా మెగా ఫాన్స్ చరణ్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా అందుకుంటారు అనుకుంటే.. చరణ్, బోయపాటి కిమ్మనకుండా ఉన్నారు. ఇక తాజాగా దీపావళికి రామ్ చరణ్ లుక్, టైటిల్ బయటికి వస్తాయనే ప్రచారం జరుగుతుంది. బోయపాటి ఈ సినిమాని భారీ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దుతున్నాడని... ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. ఇక అన్నదమ్ముల కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, హీరో ప్రశాంత్ ని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రభాస్ హీరోయిన్ తో...

దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ ఐటెం సాంగ్ ఉండబోతుందట. మామూలుగానే దేవిశ్రీ ఆల్బ‌మ్ అంటే ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే. అలాగే దర్శకుడు బోయ‌పాటికి ఐటెమ్ సాంగ్స్ పైన మ‌క్కువ ఎక్కువే. అందుకే రామ్ చరణ్ కోసం దేవిశ్రీ ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ కి మాస్ ట్యూన్ రెడీ చేశాడట. క్యాచీ, ట్రెండీ పదాల‌తో ఈ పాట‌ని బోయపాటితో పాటు దేవి శ్రీ పాటల రచయితతో రాయిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ ఐటెం సాంగ్ కోసం ఈసారి బాలీవుడ్ భామను తీసుకొచ్చే పనిలో బోయపాటి బృందం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఐటెం గర్ల్ కింద ప్రస్తుతం సాహోలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ద కపూర్ ని కానీ... లేదంటే మరో హీరోయిన్ కానీ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. శ్రద్ద అయితే ప్రస్తుతం సాహోతో తెలుగులో బాగా సుపరిచితురాలిగా ఉంది కాబట్టి.. శ్రద్ద కపూర్ ని సంప్రదించే యోచనలోనే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి సాహో చిత్రంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న శ్రద్ద కపూర్ ఐటెం గర్ల్ అవతారమెత్తుతుందో లేదో చూడాలి.

Similar News