షాకింగ్…బన్నీ అలా చేయడంలేదు!

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ  లెవెల్ లో [more]

Update: 2020-05-07 04:20 GMT

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ  లెవెల్ లో తెరకెక్కుతున్న ఈమూవీ కోసం సుకుమార్ తో పాటు బన్నీ చాలా కష్టపడుతున్నారు. ఇందులో అల్లు అర్జున్ ఓ మొరటు లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ కోసమే ఎంత కష్టపడ్డారో అర్ధం అయింది. సుకుమార్ కథకు తగ్గట్లు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తెరకెక్కిస్తారు.

అయితే బన్నీ వేసే స్టైలిష్ స్టెప్స్ ఈమూవీ లో ఉండవని  చెబుతున్నారు. ఫ్యాన్స్ కొంచం షాకింగ్ ఇచ్చే అంశమే ఇది. కానీ పల్లె నేపథ్యంలో యువకుల డాన్స్ స్టైల్ ని ఈ మూవీ కోసం సుకుమార్ అడాప్ట్ చేసుకుంటున్నారట. ఆ కాలంలో సాంగ్స్ కి స్టెప్స్ ఎలా ఉండేవో అలానే కొరియోగ్రఫీ కూడా ఉంటుందని సమాచారం. కావున బన్నీ అల్ర్టా స్టైలిష్ వెస్ట్రన్ మూమెంట్స్ పుష్పలో ఉండవని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈమూవీలో  గా నటిస్తుంది. 

Tags:    

Similar News