వేర్వేరు భాషల్లో రాజశేఖర్ కూతురు..!

Update: 2018-07-09 11:22 GMT

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతురు శివాని లేటెస్ట్ గా ‘2 స్టేట్స్’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో శివాని సరసన అడివి శేషు నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

తమిళ్ లోనూ...

తెలుగులో కాకుండా ఇతర బాషల నుండి ఆమెకు అవకాశాలు రావడం విశేషం. లేటెస్ట్ గా ఈమె తమిళంలో విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న చిత్రానికి కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. తమిళంలో కాకుండా ఇంకో భాషలో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె త్వరలో మలయాళంలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.

మాళయాళి సూపర్ స్టార్ తనయుడితో...

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా వస్తున్న కొత్త సినిమాలో శివాని ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు సమాచారం. చిన్నతనంలోనే వెండి తెరకు పరిచయం అయిన ప్రణవ్ మోహన్ లాల్.. ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొన్నాళ్లు పని చేసి.. ఇప్పుడు మలయాళంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శివాని తొలి చిత్రం రిలీజ్ కాకుండానే త్రిభాషా కథానాయిక కాబోతోందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.

Similar News