శివతో సూర్య సినిమా క్యాన్సిల్..?

తమిళ స్టార్ హీరో సూర్యతో ‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివ ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. స్టోరీ కూడా ఒకే అయిపోయింది. రీసెంట్ గా ఈ మూవీ [more]

Update: 2019-05-31 11:26 GMT

తమిళ స్టార్ హీరో సూర్యతో ‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివ ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. స్టోరీ కూడా ఒకే అయిపోయింది. రీసెంట్ గా ఈ మూవీ అధికారంగా లాంచ్ అయింది. కానీ తమిళ మీడియా ప్రకారం ఈ మూవీ ఇప్పట్లో లేనట్టే అని చెబుతున్నారు. కారణం శివ.. రజనీతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. అందుకే సూర్య మూవీని పక్కన పెట్టేసాడని టాక్ నడుస్తుంది. అయితే శివ మాత్రం సూర్యతో తన సినిమా వచ్చే ఏడాది చివర్లో ఉంటుందని చెబుతున్నాడట. ఈలోపు రజనీ మూవీ చేయనున్నాడు శివ. కాగా రజనీతో చేయబోయే సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట.

రజనీ సినిమా తర్వాతే

కాకపోతే ఇందులో రజనీ పాత్ర చాలా కొత్త, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని సమాచారం. గతంలో తెలుగులో గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత వెంటనే కోలీవుడ్ కి వెళ్లిపోయి తమిళ స్టార్ అజీత్ తో వరుసగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. తమిళంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిన శివతో సినిమాకు రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అదే కారణం. ప్రస్తుతం రజనీ మురగదాస్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత శివతో సినిమా ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News