చిరు కోసం శేఖర్ మాస్టర్ తంటాలు..!

Update: 2018-10-27 07:55 GMT

సినిమాలకు తొమ్మిదేళ్లు గ్యాప్ వచ్చినా చిరంజీవి డాన్సుల్లో పస మాత్రం తగ్గలేదనేది ఖైదీ నెంబర్ 150 తో అర్థమైంది. కుర్ర భామ కాజల్ తో కలిసి మాస్ స్టెప్స్ తో మెగాస్టార్ ఇరగదీసాడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ అదరగొట్టే డాన్స్ తో అలరించిన చిరంజీవి తాజాగా చిత్రం సైరా నరసింహారెడ్డి లో అసలు పాటలుంటాయా..? ఉంటే చారిత్రాత్మక చిత్రంలో ఎలాంటి పాటలుంటాయి... అసలు ఎలా సాధ్యం అనే అనుమానాలు ఉన్నాయి ప్రేక్షకుల్లో..? ఎందుకంటే స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి పోరాట యోధుడి లుక్ లో ఇరగదీసిన సంగతి సైరా ఫస్ట్ లో చూసాం.

అలరించే డ్యాన్సులు ఉంటాయి...

అయితే ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అంటే కచ్చితంగా చిరు డాన్స్ స్టెప్స్ ఉంటాయన్న మాట. ఇప్పటివరకు సైరా యాక్షన్ సన్నివేశాలు, దానికయిన ఖర్చు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటే.. ఇప్పుడు చిరు డాన్స్ ల విషయం హైలెట్ అయ్యింది. మరి పోరాట యోధుని సినిమాలో కూడా మాస్ ని అలరించేలా డాన్స్ లు ఉంటాయని చెబుతుంది సైరా యూనిట్. సినిమాలో యాక్షన్ కి ఎంత చోటుందో రొమాంటిక్ సన్నివేశాలకు అంటే చోటిచ్చారట. మరి మెగాస్టార్ చిరుకి సైరా లో డాన్స్ కొరియోగ్రాఫేర్ గా ఎవరు చేస్తున్నారో తెలుసా... ఖైదీ నెంబర్ 150 లో చిరు తో మాస్ స్టెప్స్ వేయించిన శేఖర్ మాస్టర్ అంట.

కొత్తదనం కావాలంటున్న చిరు...

అయితే సైరా కోసం శేఖర్ కంపోజ్ చేసే డాన్స్ స్టెప్స్ మెగాస్టార్ కి ఎక్కడం లేదనే టాక్ వినబడుతుంది. చిరు క్రేజ్ కి తగ్గ స్టెప్స్ శేఖర్ చూపించడం లేదని.. కొత్తగా ఎమన్నా కావాలని చిరు శేఖర్ ని అడుగుతున్నాడట. అసలు చిరు లాంటి స్టార్ హీరో కోసం బోలెడంతమంది కొరియోగ్రఫేర్స్ కాచుకుని కూర్చున్నారు ఛాన్స్ కోసం. మరి శేఖర్ ఏ మాత్రం తడబడిన ఆ ఛాన్స్ ఎవరో ఒక డాన్స్ మాస్టర్ తన్నుకు పోవడం ఖాయం. అందుకే శేఖర్ మాస్టర్ తన శక్తినంతా వినియోగించి చిరు కోసం కొత్త స్టెప్స్ కనిపెడుతున్నాడట. మరి కొత్త స్టెప్స్ తో చిరు నయన్, తమన్నాతో ఎలా ఆడిపాడతాడో చూడాలి.

Similar News