శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’

విభిన్నమైన ప్రేమ కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య – సాయి పల్లవి లతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. శేఖర్ కమ్ముల – [more]

Update: 2019-11-01 06:36 GMT

విభిన్నమైన ప్రేమ కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య – సాయి పల్లవి లతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. శేఖర్ కమ్ముల – చైతు -కలిసి సినిమా షూటింగ్ ని -పరిగెత్తిస్తున్నారు. ‘ఫిదా’ లాంటి భారీ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే చైతు – సాయి పల్లవి సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. శేఖర్, కమ్ముల చైతు – సాయి పల్లవి ల కాంబో సినిమాకి ఓ మంచి టైటిల్ అనుకుంటున్నాడట. ఇప్పటివరకు తన టైటిల్స్ తో ఓ ప్రత్యేకత చాటుకునే శేఖర్ కమ్ముల, చైతు సినిమాకి కూడా ఓ మంచి టైటిల్ ని సెట్ చేసినట్లుగా చెబుతున్నారు.

‘ఆనంద్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, ఫిదా’ ఇలా టైటిల్ లో వేరియేషన్స్ చాటుకునే శేఖర్ కమ్ముల చైతు – సాయి పల్లవి కాంబో సినిమాకి సింపుల్ గా ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ని పెట్టబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ… కథ మొత్తం ప్రేమ కథ తోనే ఉండడంతో ఈ సినిమాకి ఈ టైటిల్ పర్ఫెక్ట్ అంటుంది శేఖర్ కమ్ముల టీం. ఇక నాగ చైతన్య – సాయి పల్లవి ల ప్రేమ ఎలా ఉండబుతుందో అంటూ అప్పుడే ఫ్యాన్స్ రకరకాల ఊహాగానాలు తెరలేపారు. సాయి పల్లవి అంటే క్రేజ్ ఉన్న హీరోయిన్. కథకి ఇంపార్టెన్స్ ఉంటేనా నటిస్తుంది. సాయి పల్లవి ఒప్పుకుంది కాబట్టే సినిమా మీద క్రేజ్ కూడా పెరిగిపోయింది.

Tags:    

Similar News