పుష్ప ఐటెం సాంగ్ లో ఎవరంటే..!

బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 కి మించి మూడో సినిమా ఉండాలని ఇద్దరు కోరుకున్నారు. దానిలో భాగంగానే సుకుమార్ బన్నీ [more]

Update: 2020-05-02 05:47 GMT

బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 కి మించి మూడో సినిమా ఉండాలని ఇద్దరు కోరుకున్నారు. దానిలో భాగంగానే సుకుమార్ బన్నీ కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఓ మూవీ స్టార్ట్ చేసారు. పుష్ప అనే టైటిల్ తో వస్తున్నా ఈసినిమాపై భారీ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. తెలుగు తో పాటు ఈమూవీ నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో,నటీనటులు విషయంలో, మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇది రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ. ఇందులో బన్నీ రాయలసీమ చిత్తూరుకి చెందిన మొరటు కుర్రాడుగా కనిపించనున్నాడు. ఇక ఈచిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ఇందులో బన్నీ కోసం ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ని రెడీ చేశారట. సాంగ్ బాగా రావడంతో దీన్ని సెట్స్ మీదకు కూడా ఎక్కడ రాజి పడకూడదని సుకుమార్ ఐటెం సాంగ్ భామ కోసం వెతుకుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నుండి ఎవనైనా తీసుకునిరావాలని సుకుమార్ కొన్ని రోజులు నుండి ట్రై చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ నుండి హాట్ బ్యూటీ దిశా పటాని ని సుకుమార్ దాదాపు ఒకే చేసినట్లు తెలుస్తుంది. దిశా స్టెప్స్ కు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో దాంతో ఆమెను తీసుకునిరావాలని చూస్తున్నాడు సుకుమార్. గతంలో దిశా వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాలో నటించింది.

Tags:    

Similar News