శర్వా, నాని మద్య పోటీ..!

నాని జెర్సీ తరువాత చేస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుందని ఆల్రెడీ [more]

Update: 2019-02-27 10:39 GMT

నాని జెర్సీ తరువాత చేస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుందని ఆల్రెడీ నిర్మాతలు ప్రకటించారు. ఇక శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత శర్వా కోలీవుడ్ సెన్సేషనల్ మూవీ 96 తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. సమంత నటిస్తున్న ఈ సినిమాను ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన తమిళ డైరెక్టర్ తెలుగులోనూ డైరెక్ట్ చేయనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

మూడు సినిమాలు ఒకే నెలలో

ఈ సినిమాను కూడా ఆగస్టు లోనే విడుదల చేస్తానని దిల్ రాజు ఇంతకు ముందే ప్రకటించాడు. ఇక యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో కూడా అప్పుడే వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూడు సినిమాలు వారం చొప్పున గ్యాప్ లో రానున్నాయి. ఈ సినిమాల విడుదల తేదీలపై మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నిజానికి సైరా కూడా ఆగస్టు లోనే రావాలి కానీ షూటింగ్ ఆలస్యం అవుతుంది కాబట్టి వాయిదా పడింది.

Tags:    

Similar News