షారుఖ్... ఎన్నిరోజులు ఇలా..?

Update: 2018-12-24 06:33 GMT

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. షారుఖ్ సినిమాలు వస్తున్నాయంటే అతని ఫ్యాన్సే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తుంటారు. షారుక్ టీవీ ఆర్టిస్టు నుండి నెగటివ్ రోల్స్ నుండి బాద్ షా రేంజ్ కి చేరుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఇచ్చిన షారుక్ ఈ మధ్య అతని ఫ్యాన్స్ ని సంతృప్తి పర్చలేకపోయాడు. 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' లాంటి ప్రేమకథలతో కోట్లాది వసూళ్లు కొల్లగొట్టి యువత గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న షారుక్ కు గత కొన్నేళ్ల నుండి అసలు కలిసి రావడం లేదు. 2014లో వచ్చిన 'హ్యాపీ న్యూ ఇయర్' నుండి షారుక్ కు ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు.

డేంజర్ జోన్ లో షారుఖ్ మార్కెట్

అయితే అందరూ 'జీరో' మూవీ మీదే హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా మొదటిరోజు కేవలం 20 కోట్ల 14 లక్షల వసూళ్లు మాత్రమే రాబట్టగలింది. ఈ వీకెండ్ లో మరో 50 కోట్ల అందుకున్నా గొప్పేనని ట్రేడ్ సమాచారం. నవంబర్ లో వచ్చిన తగ్స్ అఫ్ హిందుస్థాన్ 50 కోట్లు కలెక్ట్ చేయగా అందులో సగం కూడా షారుక్ కలెక్ట్ చేయలేకపోయాడు. దీంతో షారుక్ మార్కెట్ ఎంత డేంజర్ జోన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వరస డిజాస్టర్స్ తో షారుక్ తన ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాడు. మరి ఇకనైనా మంచి సినిమాలు చేస్తాడు అని ఆశిద్దాం.

Similar News