తెలుగు ప్రేక్షకులంటే చిన్నచూపెందుకు..?

Update: 2018-11-26 12:37 GMT

'బాహుబలి' సినిమా నేషనల్ వైడ్ మూవీ కాబట్టి రాజమౌళి దానికి తగ్గట్టే ప్రమోషన్స్ చేసాడు. ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ని దాదాపు కలుపుకునే పోయాడు జక్కన్న. హైదరాబాద్ లో 'బాహుబలి' తెలుగు ఆడియో ఫంక్షన్ చేసిన జక్కన్న ఆ తరువాత చెన్నైలో తమిళ ఆడియో ఫంక్షన్ చేసాడు. హిందీ వాళ్ల కోసం ముంబైలో ప్రెస్ మీట్స్ పెట్టారు. 'బాహుబలి' టీం కూడా ఇండియాలో ప్రధాన నగరాలకు వెళ్లి ప్రచారం చేయడంతో ఈ సినిమాకు నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది.

ఇప్పటికే పబ్లిసిటీలో వెనుకబడ్డ 2.ఓ

'బాహుబలి'కి మించి ఎక్కువ బడ్జెట్‌ పెట్టిన ‘2.ఓ’ పబ్లిసిటీ విషయంలో చాలా వెనుక బడింది. చెన్నైలో ఆడియో లాంచ్ చేసి మన తెలుగు మీడియా ప్రతినిధులను కొంతమందిని తీసుకుని వెళ్లారు అంతే. ఆ తరువాత తెలుగులో ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. మన తెలుగు సినిమాలను అక్కడ బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ శంకర్ ఎందుకని తెలుగులో ప్రమోషన్స్ చేయడం లేదో అర్ధం కావట్లేదు. ఇది ఇండియా వైడ్ గర్వించే సినిమా కాబట్టి అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేస్తే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవి ఏమీ పట్టించుకోవట్లేదు ‘2.ఓ’ టీం. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ కోసం అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ఖాన్‌ తెలుగులో మాట్లాడిన స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు.

తెలుగులో ప్రచారం చేయకుండా...

రజనీ లేటెస్ట్ గా తమిళ వాళ్ల కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. శంకర్ బాలీవుడ్ వాళ్ల కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి తెలుగు వాళ్లకి ఎందుకు ఇవ్వలేదు..? ఎందుకని తెలుగు వారంటే అంత చిన్న చూపు..? తమిళంలో కన్న తెలుగులోనే ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి తెలుగులో ఎందుకు ప్రచారం గురించి పట్టించుకోవడం లేదో. ట్రైలర్ పెద్ద ఇంట్రెస్ట్ గా ఏమీ లేదు. అలాంటప్పుడు ప్రమోషన్స్ చేసుకుంటే ఓపెనింగ్స్ బాగా వచ్చి సేఫ్ సైడ్ అయ్యే అవకాశముంది. ఆ దిశగా అయితే మేకర్స్ ఆలోచించట్లేదు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

Similar News