వాహ్ వాట్ ఎ కాంబినేషన్..!

సౌత్ ఇండియా నే కాదు ఇండియా మొత్తం గర్వపడేలా సినిమాలు తీయడం శంకర్ స్టైల్. సౌత్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన శంకర్ రీసెంట్ గా ఆయన [more]

Update: 2019-01-03 06:31 GMT

సౌత్ ఇండియా నే కాదు ఇండియా మొత్తం గర్వపడేలా సినిమాలు తీయడం శంకర్ స్టైల్. సౌత్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన శంకర్ రీసెంట్ గా ఆయన డైరెక్షన్ లో ‘2.ఓ’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏకంగా 550 కోట్లు బడ్జెట్ పెట్టి రూపొందించాడు శంకర్. సౌత్ తో పాటు నార్త్, విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇందులో నెగటివ్ షేడ్స్ తో బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ నటించిన విషయం తెలిసిందే. పక్షిరాజు పాత్రతో ప్రేక్షకులని ఆకట్టుకున్న అక్షయ్ కి ముందు ఈ పాత్ర కోసం మరో హీరో ని అనుకున్నాడట శంకర్.

అయ్యో మిస్ అయ్యానే..!

కొంతమంది స్టార్స్ ను పరిశీలించిన శంకర్ ఆ క్రమంలోనే హృతిక్ రోషన్ తో కూడా చర్చలు జరిపాడు. కానీ హృతిక్ అందుకు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఆ పాత్ర అక్షయ్ చేయాల్సి వచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తరువాత హృతిక్ రోషన్ స్పందిస్తూ.. సినిమా చాలా బాగుంది ఇలాంటి సినిమాలు, పాత్రలను చేసేందుకు తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇటువంటి పాత్ర మిస్ చేసినందుకు ఫీల్ అవుతున్నానని ఆయన అన్నాడు. అయితే ఇటువంటి పాత్ర చేయడానికి తాను రెడీ అని అన్నాడు.

ఇండియన్ – 2 తర్వాత…

ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్ శంకర్ తో మాట్లాడి మనం ఓ సినిమా చేద్దాం అని హామీ కూడా ఇచ్చినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఎంతవరకు నిజమో చూడాలి. ప్రస్తుతం ‘భారతీయుడు’ సీక్వెల్ ఇండియన్ 2 చిత్రాన్ని చేస్తున్న శంకర్ వచ్చే ఏడాదిలో హృతిక్ రోషన్ తో మూవీ మొదలు పెట్టబోతున్నాడని సమాచారం. ‘2.ఓ’కి మించి హృతిక్ సినిమా ఉండబోతుందని సన్నిహితుల వద్ద శంకర్ చెప్పుకొచ్చాడట. త్వరలోనే వీరి కాంబినేషన్ సినిమాపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News