రెండు నిమిషాల కోసం రెండు కోట్లు కావాలట!

Update: 2018-12-11 07:01 GMT

2.ఓ ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. దర్శకుడు శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయారు. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెబుతాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారతీయుడు 2 సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మితమవుతుంది. శంకర్ అంటే భారీతనం, భారీ బడ్జెట్ అంటే శంకర్ అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. 2.ఓ కి ఎడాపెడా లైకా ప్రొడక్షన్ తో ఖర్చు పెట్టించిన శంకర్ ఇప్పుడు భారతీయుడు 2 విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదట.

కేవలం రెండు నిమిషాల కోసమే...

గత వారం రోజుల నుండి ప్రచారం జరుగుతున్నట్టుగా భారతీయుడు 2 కోసం దర్శకుడు శంకర్ గోల్డ్ కలర్ లో ఉండే బంగారు వర్ణపు ప్రత్యేక సెట్ ని వేయిస్తున్నాడని... దీని కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాడనేది నిజమేనట. అయితే ఈ బంగారు వర్ణంలో ఉండే బిస్కెట్స్ తో ప్రత్యేకమైన భారీ సెట్ కోసం శంకర్ అక్షరాలా రెండు కోట్ల ఖర్చుని నిర్మాతల చేత పెట్టిస్తున్నాడట. మరి ఆ రెండు కోట్ల సెట్ సినిమాలో ఎంతసేపు ఉంటుందో.. మనం ఎంతసేపు ఆ సెట్ ని చూడొచ్చో అనే అనుమానాలకు కూడా తెర పడింది. ఆ రెండు కోట్ల ప్రత్యేకమైన భారీ సెట్ సినిమాలో కేవలం రెండు నిముషాలు మాత్రమే కనిపిస్తుందట.

పదే పదే తప్పు చేస్తున్నాడా..?

ఇక ఆ బంగారు వర్ణపు సెట్ లోపలికి వెళ్తే.. బంగారం గనిలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందట. మరి రెండు నిమిషాల కోసం శంకర్ పెట్టించే రెండు కోట్ల ఖర్చు లెక్కలోనిది కాకపోయినా.. శంకర్ తన గత చిత్రాలు విషయంలో చేసిన తప్పు పదే పదే చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మరి రెండు నిమిషాల కోసం రెండు కోట్లు కావాలంటున్న శంకర్ సినిమా పూర్తయ్యేసరికి మరెంత పెట్టిస్తాడో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ఇకపోతే ఈ సినిమాలో కమల్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా... కమెడియన్ రోల్ ని టాలీవుడ్ నటుడు వెన్నెల కిషోర్ పోషిస్తున్నాడు.

Similar News