భారతీయుడు 2 కోసం బలగాన్ని దింపుతున్నాడు..!

Update: 2018-11-17 09:07 GMT

ప్రైడ్ డైరెక్టర్ శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో గతంలో భారతీయుడు సినిమా వచ్చి సూపర్ హిట్ అవ్వడమే కాదు సెన్సషన్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది. “భారతీయుడు 2” పేరు వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటినుండే అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

అవినీతి పైనేనా..?

కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు మలయాళం నుండి దుల్కర్ సల్మాన్ ను.. కోలీవుడ్ నుండి శింబుని తీసుకున్నట్టు సమాచారం. భారతదేశంలో జరుగుతున్న అవినీతిపై పోరాడే భారతీయుడి కథే "భారతీయుడు 1" . మరి "భారతీయుడు 2 " లో కూడా అదే పాయింట్ ను తీసుకుంటున్నాడా లేదా అన్నది తెలియాలి. అలానే తెలుగు నుంచి కూడా ఒక స్టార్ హీరోను తీసుకుని ఈ ప్రాజెక్ట్ లో జత చేయాలి అని చూస్తున్నాడు డైరెక్టర్ శంకర్.

మూడు భాషల్లోనూ క్రేజ్ కోసం

ఇప్పటికే తెలుగులో ఇద్దరు ముగ్గురిని సంప్రదించినట్టు సమాచారం. అలా మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో హీరోస్ ని తీసుకుని ఈ సినిమాలో భాగం చేస్తే ఈ మూడు భాషల్లో మంచి క్రేజీ మల్టీస్టారర్ అవుతుందని శంకర్ ఆలోచనట. ప్రస్తుతం 2.0 రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ ఈ సినిమా రిలీజ్ అవ్వగానే “భారతీయుడు 2” ను సెట్స్ మీదకు తీసుకునివెళ్లనున్నాడు.

Similar News