భార‌తీయుడు 2... `2.ఓ`ని మించి!

Update: 2018-11-27 13:47 GMT

అంత‌కుమించి అనే మాట శంక‌ర్ సినిమా 'ఐ' నుంచే పాపుల‌ర్ అయ్యింది. అందులో హీరో విక్ర‌మ్ అంత‌కుమించి... అంటూ రివేంజ్ తీర్చుకుంటుంటాడు. శంక‌ర్ సినిమాలు కూడా అదే త‌ర‌హాలో ఉంటాయి. 'అబ్బా... ఏం తీశాడ్రా' అని ముచ్చ‌ట‌ ప‌డేలోపే, ఆ త‌ర్వాత సినిమా అంత‌కు రెట్టింపు విజువ‌ల్ గ్రాండియ‌ర్‌తో ప్రేక్ష‌కుల్ని అబ్బురప‌రుస్తుంటుంది. ఈ గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న '2.ఓ' గురించి అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఆయ‌న అప్పుడే 'భార‌తీయుడు2'కి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించాడు. క‌మ‌ల్‌హాస‌న్‌తో శంక‌ర్ తీయ‌నున్న త‌దుప‌రి చిత్రం అదే.

ఇంకా కష్టపడాలట...

హైద‌రాబాద్‌కి ప్ర‌మోష‌న్ నిమిత్తం వ‌చ్చిన శంక‌ర్... ఆయ‌న్ని క‌లిసిన ఓ నిర్మాత‌తో భార‌తీయుడు 2 గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు బ‌య‌ట‌పెట్టాడ‌ట‌. '2.ఓ' త‌ర‌హాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ లేక‌పోయినా... ఆ సినిమా కోసం ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేయ‌బోతున్నాన‌ని చెప్పాడ‌ట‌. ఆ సినిమా కోసం ప‌డాల్సిన క‌ష్టం '2.ఓ' కంటే రెండింత‌లు ఉంటుంద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. భార‌తీయుడులో క‌మ‌ల్ వేసిన గెట‌ప్పులు, పాట‌లు హైలెట్‌గా నిలిచాయి. ఆ త‌ర‌హాలో 'భార‌తీయుడు 2'లో ప‌లువురు న‌టులు ప్రాస్థెటిక్ మేక‌ప్పుల్లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే పీరియాడిక్ అంశాల్ని కూడా ఆ చిత్రంలో చూపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

Similar News