‘2.0’తో శంకర్ కి తెలిసొచ్చింది..!

‘2.0’ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టిన శంకర్.. ఖర్చుకి తగ్గ రాబడి లేకపోవడంతో ఫెయిల్ అయ్యాడు. భారీ బడ్జెట్స్ తో సినిమాలు తీస్తే జనాలు చూడటానికి థియేటర్స్ [more]

Update: 2019-01-18 06:05 GMT

‘2.0’ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టిన శంకర్.. ఖర్చుకి తగ్గ రాబడి లేకపోవడంతో ఫెయిల్ అయ్యాడు. భారీ బడ్జెట్స్ తో సినిమాలు తీస్తే జనాలు చూడటానికి థియేటర్స్ కి రావడం లేదని అర్ధం అయిపోయింది. టెక్నికల్ గా శంకర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే శంకర్ ఈసారి తన నెక్స్ట్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నాడు. ప్రస్తుతం శంకర్ ‘భారతీయుడు’కి సీక్వెల్‌ని కమల్‌ హాసన్‌తో తీసే పనిలో ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ జనాలని బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువ అయిపోయాయి.

హంగులు ఉంటాయి… బడ్జెట్ మాత్రం…

అయితే ఈ చిత్రంలో కూడా శంకర్‌ తరహా హంగులు ఉంటాయి కానీ బడ్జెట్‌ మాత్రం అదుపులో ఉంటుందట. కారణం ప్రొడ్యూసర్స్ అని తెలుస్తుంది. కమల్ కు అనుకున్నంత మార్కెట్ లేకపోవడంతో నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సుముఖంగా లేరని తెలుస్తుంది. కమర్షియల్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు శంకర్. ఈసారి తన స్టైల్ సాంగ్స్ అండ్ సెట్స్ తో పాత శంకర్ ని గుర్తు చేయనున్నాడు.

Tags:    

Similar News