బాలీవుడ్ లో అయినా లక్కు కలిసొస్తుందా..?

బోల్డ్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కి పెద్దగా ఆఫర్స్ రావనేది నిన్న షాలిని పాండే నిరూపిస్తే… నేడు పాయల్ రాజపుట్ ప్రూవ్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమాలో [more]

Update: 2019-01-22 07:51 GMT

బోల్డ్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కి పెద్దగా ఆఫర్స్ రావనేది నిన్న షాలిని పాండే నిరూపిస్తే… నేడు పాయల్ రాజపుట్ ప్రూవ్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ తో లిప్ లక్స్ తో రెచ్చిపోయి నటించిన షాలిని పాండేకి.. అర్జున్ రెడ్డి అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది కానీ.. అమ్మడుకి మరో ఆఫర్ రాలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోయిన్ అవుతుందన్న వారూ షాలిని కి ఆఫర్స్ లేకపోవడం చూసి ఖంగుతిన్నారు. అయితే మహానటి సినిమాలో సావిత్రి(కీర్తి సురేష్) స్నేహితురాలిగా నటించిన షాలిని తమిళంలో 100 పెర్సెంట్ కాదల్ సినిమాలో నటించింది.

బాలీవుడ్ లో ఛాన్స్…

ఇక తెలుగులో తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ న్యూ మూవీ 118లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక షాలినికి తెలుగులో మాత్రం ఓ అన్నంత అవకాశాలు అయితే లేవు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ కి ధీటుగా నటించిన ఈ చిన్నది తెలుగులో, తమిళంలో అవకాశాలు లేక వెలవెలబోతుంది. కానీ అమ్మడుకి లేటెస్ట్ గా బాలీవుడ్ ఆఫర్ తగిలిందని చెబుతున్నారు. హిందీ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్య కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా బాంఫాడ్ లో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట.

 

ఫస్ట్ సినిమానే…

మరి అనురాగ్ కశ్యప్ సమర్పిస్తున్న సినిమాతో బాలీవుడ్ కి పరిచయమవుతున్న షాలినికి ఆ బ్యానర్ తో మంచి పేరొస్తుంది. మరి మొదటి సినిమాకే షాలిని అనురాగ్ లాంటి సమర్పకుడు తగలడం షాలిని అదృష్టమని చెప్పాలి. మరి తెలుగు, తమిళంలో అవకాశాలు లేని షాలిని కి బాలీవుడ్ లో అయినా లక్కు కలిసొస్తుందేమో చూద్దాం.

Tags:    

Similar News