సస్పెన్స్ థ్రిల్లర్ లో అర్జున్ రెడ్డి పిల్ల..!

విజయ్ దేవరకొండతో కలిసి బోల్డ్ కంటెంట్ ఉన్న అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ కిస్సులతో రెచ్చిపోయిన షాలిని పాండేకి ఆ సినిమా హిట్ తో టాలీవడ్ [more]

Update: 2019-02-27 07:12 GMT

విజయ్ దేవరకొండతో కలిసి బోల్డ్ కంటెంట్ ఉన్న అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ కిస్సులతో రెచ్చిపోయిన షాలిని పాండేకి ఆ సినిమా హిట్ తో టాలీవడ్ లో అవకాశాలు వెల్లువెత్తుతాయని అనుకుంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. టాలీవుడ్ లో అవకాశాలు లేట్ గా తలుపు తట్టినప్పటికీ… తమిళనాట మాత్రం 100 పర్సెంట్ కాదల్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇక తెలుగు, తమిళంలో తెరకెక్కిన మహానటిలో సావిత్రి స్నేహితురాలి పాత్రలో మెరిసిన షాలిని పాండే తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన 118 సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. 118 సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో ఉన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

షాలినీ చుట్టూనే నడుస్తుందట…

ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ఆయన ఫియాన్సీ పాత్రలో నటించింది షాలిని. షాలిని పాండే సెట్స్ లో మహా అల్లరి చేస్తుందని.. కళ్యాణ్ రామ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇకపోతే.. 118లో నివేత థామస్ చుట్టూనే కథ తిరుగుతుందని.. షాలిని పాండే గ్లామర్ తో.. కళ్యాణ్ రామ్ తో కలిసి ఆకట్టుకుంటుందని చెబుతుంది 118 టీం. మరి అర్జున్ రెడ్డి అనే బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను పలకరించిన.. షాలిని ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 118 సినిమా హిట్ అయితే షాలిని తెలుగులో కాస్త నిలదొక్కుకుంటుంది.. లేదంటే ఒకటి రెండు సినిమాలకే దుకాణం సర్దేయ్యాల్సి ఉంటుంది.

Tags:    

Similar News