గతంలో హిట్టు.. కానీ ఇప్పుడు అలా కాదు.. అందుకే!!

జబర్దస్త్ ఈటీవీలో మొదలైనప్పుడు వేణు, ధనరాజ్, చంద్ర, షకలక శంకర్ లే జబర్దస్త్ టీం లీడర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ లో బాగా క్రేజ్ ఫేమ్ [more]

Update: 2020-09-02 04:36 GMT

జబర్దస్త్ ఈటీవీలో మొదలైనప్పుడు వేణు, ధనరాజ్, చంద్ర, షకలక శంకర్ లే జబర్దస్త్ టీం లీడర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ లో బాగా క్రేజ్ ఫేమ్ రాగానే వెండితెర వైపుకి అడుగులువేస్తూ జబర్దస్త్ ని వదిలేసారు. అయితే జబర్దస్త్ ని వదిలేసాక మల్లి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి వేణు – ధనరాజ్ లాంటి వాళ్ళు ట్రై చేసి చివరికి నాగబాబు తో అదిరింది షోలో స్కిట్స్ చేసుకుంటుంటే.. షకలక శంకర్ జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి స్కిట్స్ తో టాప్ లో ఉండేవాడు. తర్వాత వెండితెర మీద కామెడితో పాటుగా హీరో ఆతారమెత్తాడు. హీరోగా సక్సెస్ కాలేక…. మళ్ళీ నాగబాబు అదిరిందికి వెళ్ళిపోయాక.. ఇప్పుడు జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు శంకర్.

అయితే గతంలో మాదిరిగా షకలక శంకర్ స్కిట్స్ జర్దాస్త్ లో పేలడం లేదు. అందుకే ఆయన స్కిట్స్ ఎపిసోడ్ చివరిలో వేస్తున్నారు నిర్వాహకులు. జబర్దస్త్ లో శంకర్ స్కిట్స్ కి రేటింగ్ రావడం లేదని, యూట్యూబ్ లోను శంకర్ స్కిట్స్ కి క్రేజ్ తగ్గిందని.. అందుకే మల్లెమాల వాళ్ళు శంకర్ కి తక్కువ పారితోషకం ఇవ్వడంతో షకలక శంకర్ కి బాధ కలిగి జబర్దస్ ని వదిలేస్తున్నట్టుగా సోషల్ మీడియా టాక్. స్కిట్స్ లో ప్రాధాన్యత లేకపోవడమా? లేదంటే మళ్ళీ హీరో పాత్రల మీద మోజు కలిగిందో కానీ.. షకలక శంకర్ ఇప్పుడు జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో మొదలయ్యింది.

Tags:    

Similar News