శైలజ రెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ బిజినెస్..!

Update: 2018-09-10 08:09 GMT

నాగ చైతన్య - అను ఇమ్మాన్యువల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా రేపు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫుల్లీ కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. పవర్ ఫుల్ అత్త పాత్రలో రమ్యకృష్ణ.. ఇగోయిస్టు కూతురిగా అను ఇమ్మాన్యువల్, అన్నింటినీ లైట్ తీసుకునే అల్లుడి పాత్రలో నాగ చైతన్య .. పేరున్న కమెడియన్స్ చేసే కామెడీ ఈ సినిమా కి మరింత హిప్ క్రియేట్ చేసింది. మరి మారుతి ఈ సినిమాని పక్కా కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కించాడని శైలజ రెడ్డి అల్లుడు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి రేపు గురువారం విడుదల కాబోతున్న శైలజ రెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు...

ఏరియా బిజినెస్ (కోట్లలో)

నైజాం 6.50

సీడెడ్ 3.20

నెల్లూరు 0.76

కృష్ణ 1.50

గుంటూరు 1.73

వైజాగ్ 2.40

ఈస్ట్ గోదావరి 1.55

వెస్ట్ గోదావరి 1.25

టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 18.89 కోట్లు

ఇతర ప్రాంతాలు 2.25

ఓవర్సీస్ 3.40

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 24.54 కోట్లు

Similar News