టాక్ తో శైలజారెడ్డికి సంబంధం లేదా..?

Update: 2018-09-15 08:24 GMT

నాగ చైతన్య - మారుతి కాంబోలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు హవా థియేటర్స్ లో కొనసాగుతుంది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మొదటి రోజు వసూళ్లు మాత్రం బాగున్నాయి. వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమా శుక్రవారం కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. వరల్డ్ వైడ్ గా కూడా మంచి వసూళ్లు కొల్లగొట్టడమే కాదు.. మొదటి రోజు శైలజారెడ్డి అల్లుడుతో నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం చూస్తుంటే.. సినిమా టాక్ కి, కలెక్షన్స్ కి సంబంధమే లేదనిపిస్తుంది. ఇక ఈ శనివారం, ఆదివారం కూడా శైలజ రెడ్డి అల్లుడు టికెట్ బుకింగ్స్ జోరుగా ఉండడం చూస్తుంటే ఈ వీకెండ్ లో శైలజారెడ్డి భారీగానే కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయంగా కనబడుతుంది. మరి శైలజారెడ్డి అల్లుడు 2 రోజుల 2 రాష్ట్రాల కలెక్షన్స్ మీకోసం...

ఏరియా షేర్స్(కోట్లలో)

నైజాం 2.42

సీడెడ్ 1.21

నెల్లూరు 0.35

కృష్ణ 0.55

గుంటూరు 0.80

వైజాగ్ 0.90

ఈస్ట్ గోదావరి 0.98

వెస్ట్ గోదావరి 0.57

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 7.78

Similar News