నాగశౌర్య కు భయపడుతున్న చైతు

Update: 2018-08-20 04:32 GMT

ఈనెల ఆగస్ట్ 31న టాలీవుడ్ లో రెండు మీడియం రేంజ్ సినిమాలు వస్తున్నాయి. ఒకటి నాగ చైతన్య నటించిన 'శైలజారెడ్డి అల్లుడు'..ఇంకోటి నాగ శౌర్య నటించిన 'నర్తనశాల'. ఈ రెండు ఈవారం తలపడనున్నాయి. 'శైలజారెడ్డి అల్లుడు' కి పోటీగా 'నర్తనశాల' సినిమా వస్తే ఏ సెంటర్స్‌ మరియు ఓవర్సీస్‌లో కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని..'నర్తనశాల' సినిమా ఒక వారం వాయిదా వేసుకోమని ఆ చిత్ర నిర్మాతలను కోరారంట 'శైలజారెడ్డి అల్లుడు' మేకర్స్.

అంటే సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేసుకోమని వచ్చిన డిస్కషన్స్ కు నో చెప్పారు 'నర్తనశాల' నిర్మాతలు. ఈ సినిమాకి ఆల్రెడీ బిసినెస్ కూడా అయిపోవడంతో..బయ్యర్లకి కూడా విడుదల తేదీ వల్ల అభ్యంతరాలు లేకపోవడంతో సినిమాను వాయిదా వేయటానికి అంగీకరించలేదు అని తెలుస్తుంది.

అసలు ఈరెండు సినిమాల జోనర్స్ వేరని..వాయిదా ఎందుకు వేసుకోవటం అని ఆలోచనట. సో దాంతో 'శైలజారెడ్డి అల్లుడు' మేకర్స్‌ కి ఇప్పుడు ఆ పోటీ తప్పదు. స్టార్‌ కాస్ట్‌ పరంగా, బిజినెస్‌ పరంగా, మాస్‌ అప్పీల్‌ పరంగా 'శైలజారెడ్డి అల్లుడు'కి అడ్వాంటేజ్‌ వుంటే, కాన్సెప్ట్‌, ఆఫర్‌ చేసే కొత్తదనంతో పాటు అందులో నాగ శౌర్య 'గే' పాత్రలో నటించడటంతో నర్తనశాల స్కోర్‌ చేసే అవకాశముంది. కానీ మారుతీ తన మార్క్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తాడని భావిస్తున్నారు నిర్మాతలు

Similar News