విమర్శించేవారికి ఈసినిమా గట్టిగా సమాధానం ఇచ్చిందిగా

ఎన్నో వివాదాలు మధ్య, ఎన్నో విమర్శలు మధ్య కబీర్ సింగ్ సినిమా ఇంకా స్ట్రాంగ్ గా వసూళ్లు రాబడుతుంది. అసలు ఈసినిమా ని ఎవరు పటించుకోరు అనుకుంటే [more]

Update: 2019-07-16 06:42 GMT

ఎన్నో వివాదాలు మధ్య, ఎన్నో విమర్శలు మధ్య కబీర్ సింగ్ సినిమా ఇంకా స్ట్రాంగ్ గా వసూళ్లు రాబడుతుంది. అసలు ఈసినిమా ని ఎవరు పటించుకోరు అనుకుంటే ఏకంగా వరల్డ్ వైడ్ గా ఈచిత్రం 300 కోట్లు రూపాయిలు కలెక్ట్ చేసి అందరిని ఆశర్యపరుస్తుంది. కేవలం 70 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం మూడు వీకెండ్స్ ముగిసేసరికి ఏకంగా 300 కోట్ల సంపాదించడంతో అటు ట్రేడ్ వారు కూడా ఆశర్యపోతున్నారు.

ఒక్క ఇండియా లోనే ఈసినిమా 260 కోట్ల రూపాయలు వచ్చాయి. మన తెలుగు లో కన్న హిందీ లోనే ఈచిత్రంకు విమర్శలు వచ్చాయి. మొదటి వారం ఈమూవీ 134 కోట్లు ,రెండోవారం 79 కోట్లు, మూడోవారం 36 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మరో వారం వరకు ఈసినిమాకు డోకా లేదు అంటున్నారు ట్రేడ్.

అయితే బాలీవుడ్ లో మహిళా సంఘాలు సందీప్ వంగా పై ఫైర్ అవుతున్నారు. ఇటువంటి సినిమాలు ఎలా తీస్తారు అని అడుగుతున్నారు. కానీ సందీప్ అవిఏమి పటించుకోకుండా దీని బాబు లాంటి సినిమా తీస్తానని కూడా ఛాలెంజ్ చేశాడు.సందీప్ నెక్స్ట్ మూవీ ఎక్కడ తీస్తాడో ఇంకా క్లారిటీ లేదు.

Tags:    

Similar News