సీనియర్ హీరోలకి హీరోయిన్లు దొరకడం లేదా..?

Update: 2018-05-25 05:37 GMT

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత బాగానే ఉంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు హీరోయిన్లని వెతకాలంటే చాలా కష్టంగా మారింది. ఒక్కప్పుడు హీరోల కోసం హీరోయిన్స్ వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కోసం హీరోలు వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ గా రవి తేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' నుంచి అను ఇమ్మానియేల్ తప్పుకోవడంతో ఇలియానాను తీసుకుందాం అనుకున్నారు. అయితే ఆమె 2 కోట్లు డిమాండ్ చేసిందంట. ప్రొడ్యూసర్లకి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇల్లి అడిగిన దానికి ఒకే చెప్పారని సమాచారం. వాస్తవానికి ఇలియానాకు టాలీవుడ్ లో ఆఫర్లు ఎప్పుడో ఆగిపోయాయి. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరో పక్క వైఫ్ క్యారక్టర్స్ లేదా ఓ మోస్తరు పాత్రలే తప్పించి కెరీర్ పీక్స్ లో ఎంజాయ్ చేసిన పాత్రలు అయితే ఏమీ వేయలేదు. మరి ఇప్పుడు ఆమెకు అంత ఇచ్చి రవితేజ సినిమాలో తీసుకోవడానికి కారణం హీరోయిన్ కోసమే అమెరికా షెడ్యూల్ వాయిదా వేసి పరిస్థితి లేకపోవడం.

నయనతార కోసం ఎదురుచూపులు..

మరోపక్క బాలకృష్ణ - వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి నయనతారని తీసుకుందాం అనుకున్నారు, కానీ ఆమెకు తెలుగులో 'సైరా'తో పాటు తమిళ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలో ఆమె చేసే ఛాన్స్ తక్కువే అని తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. ఆ సెంటిమెంట్ పరంగా ఆమెను తీసుకుందాం అనుకున్నారు కానీ కుదరటం లేదు.

సీనియర్ హీరోలకే ఎక్కువ కష్టం..

ఇక విక్టరీ వెంకటేష్ ఎఫ్ 2 లో తమన్నా కోసం ఇలియానా తరహాలోనే భారీగా ఆఫర్ చేసారని తెలిసింది. నాని - నాగార్జున మల్టీ స్టారర్ లో కూడా నాగార్జున సరసన పెళ్ళైన ఆకాంక్ష సింగ్ ను తీసుకోవడానికి కారణం ఇదే సో సీనియర్ హీరోలకు హీరోయిన్ ని సెట్ చేయటం కత్తి మీద సాములా మారింది.

Similar News