మహేష్ సినిమాలో అలనాటి హీరోయిన్..!

వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి లేటెస్ట్ గా ఎఫ్ 2 చిత్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అనిల్ [more]

Update: 2019-04-25 07:38 GMT

వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి లేటెస్ట్ గా ఎఫ్ 2 చిత్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అనిల్ మహేష్ బాబుతో ఓ పవర్ ఫుల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. డైరెక్టర్ అనిల్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నాడు. కాగా ఈ చిత్రంలో విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించనున్నారనే వార్త ఇప్పటికే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

విజయశాంతి కోసం వెయిటింగ్

ఆ పాత్ర విజయశాంతి మాత్రమే చేయగలిగిన పాత్ర కావడంతో ఆమెను సంప్రదించాడు అనిల్. అయితే ఆమె ఆ పాత్ర చేసేందుకు మాత్రం సమ్మతం తెలపలేదని సమాచారం. షూటింగ్ కి ఇంకా టైం ఉండడంతో అప్పటివరకు ఆమె కోసం వెయిట్ చేద్దామని డిసైడ్ అయ్యాడట అనిల్. ఒకవేళ ఆమె కాదంటే మనోడి దగ్గర మరో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ పాత్రని రమ్యకృష్ణ లేదా జయప్రదతో చేయించాలని దర్శకుడు అభిప్రాయపడుతున్నాడంట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News